మచిలీపట్నంలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినం

17 Jun, 2020 20:58 IST|Sakshi

సాక్షి, కృష్ణా :  మచిలీపట్నంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు గురువారం ఆర్డీఓ ఖాజావలీ పేర్కొన్నారు. రేపటి (గురువారం) నుంచి మచిలీపట్నంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఆర్డీఓ తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించారు. మూడు స్థంభాల సెంటర్‌లో చెక్‌పోస్టునును మరింత పటిష్టంగా నిర్వహిస్తామన్నారు.
(ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్‌ )

కర్ఫ్యూను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఎవరు రోడ్డు మీదకు వచ్చినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డివిజన్‌లో కేసులు 54కు చేరాయి. కేవలం మచిలీపట్నం నియోజకవర్గంలోనే అత్యధికంగా 40 కేసులు నమోదయ్యాయి. కార్పొరేషన్‌లో 29, రూరల్‌లో 11 కేసులు నమోదు కాగా తాజాగా బుధవారం ఒక్క రోజులోనే 13 కేసులు నమోదు అయ్యాయి. మచిలీపట్నం రూరల్ మాలకాయలంకలో 4, ఉల్లిపాలెంలో 2,  మంగినపూడిలో 1,  నిజాంపేటలో 3,  సర్కారుతోటలో 2, జవ్వారుపేటలో 1 కేసులు వెలుగు చూశాయి. 
(వైద్యులకు పూర్తి వేతనాలు: సుప్రీంకోర్టు)

మరిన్ని వార్తలు