సమీక్షలకు సిద్ధం

17 Sep, 2014 01:48 IST|Sakshi
సమీక్షలకు సిద్ధం

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం నడుం బిగించింది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలతో దగాపడ్డ జనం తరఫున నిలిచేందుకు పార్టీ యంత్రాంగాన్ని సమయాత్తం చేయాలని నిర్ణయించారు. పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టిన.. అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి, కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు ‘తూర్పు’ సెంటిమెంట్‌గా భావించే తుని నుంచి నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తలు, నేతలతో విస్తృత స్థాయి సమావేశాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు ఈ నెల 19వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు.
 
 నియోజకవర్గ సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజు తుని నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత రోజుకు రెండు నియోజకవర్గాల వంతున కేడర్‌తో సమావేశం కానున్నారు. ఉదయం ఒకటి, సాయంత్రం   మరొక నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నెహ్రూ సమావేశాల షెడ్యూల్‌ను మంగళవారం కాకినాడలో విడుదల చేశారు.తూర్పు సెంటిమెంట్‌గా తునిలో ప్రారంభమయ్యే సమావేశాలు రెండో రోజు కోనసీమలోని రాజోలు దీవిలో జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సమావేశాలకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారని నెహ్రూ తెలిపారు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
 షెడ్యూల్ ఇదే..
 9న మధ్యాహ్నం 3 గంటలకు    తుని
 20న ఉదయం  9 గంటలకు    రాజోలు
 20న మధ్యాహ్నం 2 గంటలకు    పి గన్నవరం
 21న ఉదయం 9 గంటలకు    అమలాపురం
 21న మధ్యాహ్నం 2 గంటలకు    ముమ్మిడివరం
 22న ఉదయం 9 గంటలకు    కొత్తపేట
 22న మధ్యాహ్నం 2 గంటలకు    మండపేట
 23న ఉదయం 9 గంటలకు    రామచంద్రపురం
 23న మధ్యాహ్నం 2 గంటలకు    అనపర్తి
 24న ఉదయం 9 గంటలకు    కాకినాడ సిటీ
 24న మధ్యాహ్నం 2 గంటలకు    కాకినాడ రూరల్
 25న ఉదయం 9 గంటలకు    పిఠాపురం
 25న మధ్యాహ్నం 2 గంటలకు    పెద్దాపురం
 26న ఉదయం 9 గంటలకు    రాజానగరం
 26న మధ్యాహ్నం 2 గంటలకు    రంపచోడవరం
 27న ఉదయం 9 గంటలకు    రాజమండ్రి సిటీ
 27ర మధ్యాహ్నం 2 గంటలకు    రాజమండ్రి రూరల్
 29న ఉదయం 9 గంటలకు    ప్రత్తిపాడు
 29న మధ్యాహ్నం 2 గంటలకు    జగ్గంపేట
 

మరిన్ని వార్తలు