మున్సిపోల్స్‌కు కసరత్తు

3 Mar, 2014 02:34 IST|Sakshi


 శ్రీకాకుళం సిటీ మున్సిపల్ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు మొదలెట్టింది. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసినట్లు సంకేతాలు అందడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టారు.

శని, ఆదివారాల్లో ఇటు ఎన్నికల అధికారులు, అటు మున్సిపల్ అధికారులు ఆ పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. కోర్టు కేసులు, ఇతరత్రా ఇబ్బం దులు లేని మున్సిపాలిటీల్లో చైర్మన్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లను శనివారమే ప్రకటించిన అధికారులు, ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీలకు

సంబంధించి ఓటర్ల తుది జాబితాలు విడుదల చేశారు. ఆమదాలవలసలో 23 వార్డులు, ఇచ్ఛాపురంలో 23 వార్డులు, పలాస-కాశీబుగ్గలో 25 వార్డులు, పాలకొండలో 20 వార్డుల తుది ఓటర్ల జాబితాలను సంబంధిత కమిషనర్లు ఆదివారం ప్రకటించారు. శ్రీకాకుళం, రాజాంలలో కోర్టు కేసుల కారణంగా ఈ దఫా ఎన్నికలు జరగకపోవడంతో ఈ రెండు చోట్ల ఓటర్ల జాబితాలు ప్రకటించలేదని అధికారులు తెలిపారు. కాగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 30న నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాాంతరెడ్డి సోమవారం దీని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

దీని సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చర్చించినట్లు సమాచారం. అయితే ఏప్రిల్‌లో పార్లమెంట్‌తో సహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటికంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం మేలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే.. శ్రీకాకుళం, రాజాం మున్సిపాలిటీలు మినహా ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, పాలకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ ఈ మున్సిపాలిటీల్లో అధికార సిబ్బంది వివరాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే సేకరించారు.
 

నేడు వీడియో కాన్ఫరెన్స్
 

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చేయాల్సినఏర్పాట్లు, అధికారుల విధు లు, అవసరమైన ఈవీఎంలు ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు సోమవా రం ఉదయం మున్సిపల్ శాఖ కమిషనర్ బి.జనార్ధనరెడ్డి రాష్ట్రంలోని అంద రు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.
 
 

మరిన్ని వార్తలు