రియల్ రూటెటు?

31 Aug, 2014 02:08 IST|Sakshi
రియల్ రూటెటు?

- అయోమయంలో క్రయవిక్రయదారులు
- కొనసాగుతున్న వ్యాపారుల మాయజాలం
- అప్పుడు గుంటూరు.. ఇప్పుడు మార్టూరు!
- రెండింటి నడుమన చిలకలూరిపేట
చిలకలూరిపేట: రాష్ట్ర రాజధాని విషయంలో రోజుకో విధంగా వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం చిలకలూరిపేట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం రూటును మార్చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు గతంలో చేసిన ప్రకటనలు.. తాజాగా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాల కారణంగా భూములు, స్థలాల క్రయవిక్రయదారులు తీవ్ర అయోమయూనికి గురవుతున్నారు.

ఈ సందిగ్ధ స్థితిని సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు యత్నిస్తున్నారు. గుంటూరు-విజయవాడ ప్రాంతాల్లో ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మించటం సరికాదని, దీనికి మార్టూరు-వినుకొండ-దోనకొండ ప్రాంతం సానుకూలంగా ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో పేర్కొనటంతో అందరి దృష్టి చిలకలూరిపేట ప్రాంతంపై పడింది.
 
ప్రకాశం జిల్లాలోని మార్టురు చిలకలూరిపేట పట్టణం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నియోజవర్గానికి సరిహద్దు ప్రాంతం కూడా, మార్టూరు ప్రాంతానికి చెందిన అత్యధిక మందికి చిలకలూరిపేటతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నారుు. విద్య, వైద్యం తదితర అవసరాల కోసం చిలకలూరిపేటనే ఆశ్రయిస్తుంటారు. దీంతో మార్టూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటయితే చిలకలూరిపేట నియోజకవర్గం భారీఎత్తున అభివృద్ధి చెందుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రచారం ప్రారంభించారు. దీంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం క్రయవిక్రయూలు పెద్దగా లేకపోయినా రాజధాని పేరిట రేట్ల దూకుడుపై ప్రచారం మాత్రం పెద్దఎత్తున కొనసాగుతోంది.
- గతంలో కొండవీడు అభివృద్ధి, టైక్స్‌టైల్ పార్కు, స్పైసెస్ పార్కుల ఏర్పాటు, బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అంశాలు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి దోహదపడ్డాయి. తర్వాత అవి అటకెక్కటంతో క్రయవిక్రయూలు పడకేశాయి. ప్రస్తుతం రాజధాని ప్రచారంతో జిల్లాకు సంబంధించిన వారే కాక రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిలకలూరిపేటవైపు దృష్టి సారించటంతో భూములు, స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది.
- చిలకలూరిపేట పట్టణానికి సమీపంలోని భూములతోపాటు యడ్లపాడు, నాదెండ్ల ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ. 85 లక్షల నుంచి  కోటీ 10 లక్షల రూపాయల వరకు చేరింది. 16వ నంబర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న భూములకు మరింత ఎక్కువ ధర పలుకుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు ఎకరాలకు ఎకరాల భూములను గుంటూరు-చిలకలూరిపేటల మధ్య కొనుగోలు చేశారని సమాచారం.
- ఈ ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రులు తమ బంధువుల ద్వారా భూముల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తాము కొనుగోలు చేసిన భూములను లేఅవుట్లుగా మార్చి ప్లాట్లు విక్రరుుంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు గుంటూరు వైపు ఉన్న భూముల క్రయవిక్రయూలు జోరుగా జరగ్గా.. ప్రస్తుతం మార్టూరు వైపు ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతోంది.

మరిన్ని వార్తలు