టీడీపీ పోటీ నామమాత్రమే

27 Mar, 2014 02:45 IST|Sakshi
  •      మున్సిపాలిటీల్లో ఎన్నికల సరళి
  •      పుంగనూరులో నామమాత్రంగా ప్రచారం  
  •      పలమనేరు, మదనపల్లెలోఉనికి చాటుకునే ప్రయత్నం
  •  సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, మదనప ల్లె మున్సిపాలిటీల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయ దుందుభి మోగించనుంది. ఈ మున్సిపాలిటీల్లో తాము గెలిచే అవకాశం లేదని టీడీపీ వారు చేతులెత్తేశారు. పుంగనూరులో నామమాత్రంగా ప్రచారం చేస్తున్నారు.
     
    పుంగనూరులోని 24 వార్డుల్లో ఒకచోట వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. 23 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వైఎస్‌ఆర్ సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి,  పీ.ద్వారకనాథరెడ్డి ప్రచారం చేస్తున్నారు. రాజకీయా ల్లో అపార అనుభవం ఉన్న పెద్దిరెడ్డి తన శక్తిని ఉపయోగించి మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేయనున్నారు.

    టీడీపీ నుంచి వెంకటరమణరాజు, శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి ఒకటిరెండు రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వెంకటరమణరాజు, శ్రీనాథరెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో టీడీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పుంగనూరులో 20 వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, మూడు వార్డుల్లో మాత్రమే పోటీ ఉంటుందని స్థానిక రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
     
    పలమనేరులో..

    పలమనేరు మున్సిపాలిటీలోనూ వైఎస్‌ఆర్ సీపీకి సంపూర్ణ మెజారిటీ రానుంది. మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో 18 వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ సునాయాసంగా గెలుస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథరెడ్డి నాయకత్వంలో పీవీ.కుమార్, పీ.శారద, హేమంతకుమార్‌రెడ్డి (మిలటరీ హేమంత్), మండి సుధ, మురళీకృష్ణ, ఖాజా, చాంద్‌బాష, రహీంఖాన్ వంటి ముఖ్య నాయకులు మున్సిపాలిటీలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

    ఎనిమిది వార్డుల్లో ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించారు. వీరంతా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీలో 37,900 ఓట్లు ఉండగా ముస్లిం ఓట్లు సుమారుగా 13,900 ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓట్లన్నీ వైఎస్‌ఆర్ సీపీకేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తరఫున గల్లా అరుణకుమారి అనుచరులు ఐదుగురు వార్డుల్లో పోటీ చేస్తున్నారు. ప్రచారంలో సుభాష్‌చంద్రబోస్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నాయకులు ఎవ్వరూ టీడీపీ తరఫున కనిపించకపోవడంతో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు కూడా నీరసించారు.
     
    మదనపల్లెలో..
     
    మదనపల్లె మున్సిపాలిటీలో టీడీపీ పోటీ నామమాత్రమేనని స్థానికులు చెబుతున్నారు. వైఎస్‌ఆర్ సీపీ పది వార్డుల్లో సునాయాసంగా గెలుస్తుందని, 18 చోట్ల టీడీపీకి, వైఎస్‌ఆర్ సీపీకి పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రెండు పార్టీల మధ్య 18 వార్డులకు జరిగే పోటీలో మూడొంతుల వార్డులు వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని, అంటే సుమారు 14 వార్డుల్లో తప్పకుండా గెలుస్తామనే ధీమాలో వైఎస్‌ఆర్ సీపీ వారు ఉన్నారు.

    వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు షమీమ్‌అస్లామ్, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డిల నాయకత్వంలోజిల్లా నాయకులు ఉదయ్‌కుమార్, గాయత్రీదేవి, మైనారిటీల నాయకులు బాబ్‌జాన్, అక్తర్ మహమ్మద్, మాధవరెడ్డి వార్డుల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరులోనూ వైఎస్‌ఆర్ సీపీ అంటే ఎంతో అభిమానం ఉందని వారు చెబుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున రాందాస్ చౌదరి, బోడపాటి శ్రీనివాస్, నాదెండ్ల విద్యాసాగర్, శ్రీరామ్‌చినబాబు, మిట్స్ కృష్ణకుమార్, బీఆర్ తులసీప్రసాద్ ప్రచారం సాగిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు