రికార్డింగ్ డాన్సర్ల అరెస్టు

4 Jun, 2015 10:59 IST|Sakshi

విశాఖపట్నం: పెళ్లి వేడుకలో రికార్డింగ్ డాన్స్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు డాన్సర్‌లతో పాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ కుమారుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. వివరాలు.. తెలుగుదేశం పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ బద్దపు లక్ష్మి చిన్న కుమారుడు ప్రసాద్ పెళ్లి వేడుకల్లో భాగంగా, పెద్ద కుమారుడు శ్రీనివాస్ రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు డాన్సర్లతో పాటు పెళ్లి కొడుకు, అతని అన్న శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ శ్రీనివాస్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో విశాఖ జిల్లాలో రికార్డింగ్ డాన్స్‌లో భాగంగా పలు అఘాయిత్యాలు జరిగిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రికార్డింగ్ డాన్సులను నిషేధించారు.

మరిన్ని వార్తలు