కోడెల శివప్రసాదరావు స్టేడియంలో రికార్డులు మాయం

2 Jun, 2019 11:16 IST|Sakshi

సాక్షి, గుంటూరు : నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో రికార్డులు మాయమయ్యాయి. అభివృద్ధి పనుల వివరాలు అడగడంతో కమిటీ సభ్యులు రికార్టులను మాయం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనఖీతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పూర్తి విచారణ జరపాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలో నర్సరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు తన పేరుతోనే క్రీడా మైదానాన్ని నిర్మించారు. రూ.వందల కోట్ల ప్రభుత్వ నిధులతో ‘కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం’ను నిర్మించారు.

ప్రభుత్వ నిధులతో తన పేరిట నిర్మించిన స్టేడియాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటూ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు సైతం జారీ చేశారు. వసూలు చేసే నిధులు స్టేడియాల అభివృద్ధికి కాకుండా నేరుగా కోడెల తనయుడి జేబులోకి వెళ్లాయని ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. వసూలు చేసిన సొమ్ముతో చేసిందేమీ లేదని విమర్శిస్తున్నాయి.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
స్టేడియంను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

>
మరిన్ని వార్తలు