ఎర్రచందనం పట్టివేత

7 Jan, 2014 04:50 IST|Sakshi

 ఆళ్లగడ్డ రూరల్, న్యూస్‌లైన్ :
 నల్లమల్ల నుంచి అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనం దుంగలను సోమవారం తెల్లవారుజామున ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు సుమోతో సహా పట్టుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం బసవతారకం నగ ర్‌కు చెందిన రాజు నరసింహ స్వామి దర్శనార్థం సుమో బాడుగకు తీసుకుని అహోబిలం వచ్చాడు. అదివారం అహోబిలం చేరుకుని స్థాని కులు రామాంజీ, బాలు, నగేష్, ఓబులేసును పరిచ యం చేసుకున్నాడు. రాత్రి అడవిలోని గండ్లేరు ప్రాంతానికి వెళ్లి ఎనిమిది ఎర్రచందనం దుంగల ను నరికి సుమోకు ఎక్కించారు. ఇం దుకు డ్రైవర్ గోవిందు అభ్యంతరం చెప్పగా బాడుగ అధికంగా ఇస్తామని నచ్చజెప్పారు. వీరు సుమోతో ఆళ్లగడ్డ వైపు వస్తుండగా అప్పటికే సమాచా రం తెలుసుకున్న పోలీసులు బాచ్చాపురంమెట్ట వద్ద వల పన్ని పట్టుకున్నా రు. బైకులో ముందు వస్తున్న ముగ్గు రు సుమోలోని ఇద్దరు పారిపోగా డ్రైవ ర్ గోవిందు పట్టుబడ్డాడు. సుమో., అందులో ఉన్న రూ. 5లక్షల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

మరిన్ని వార్తలు