ఎర్రచందనం కోసం రూ.22కోట్లతో గోదాము

3 May, 2017 15:46 IST|Sakshi

విజయవాడ: ఎర్రచందనం కోసం నిర్మించిన గిడ్డంగులను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. సుమారు రూ.22 కోట్లతో 25 ఎకరాల్లో ప్రభుత్వం తిరుపతిలో నిర్మించినట్లు ఆయన తెలపారు. బుధవారం ఆయన అటవీశాఖ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు 950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.

మరో 2 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మడానికి త్వరలోనే టెండర్లను పిలుస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ముఖ్యమంత్రితో సంప్రదించి త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు