ఎర్ర ‘కింగ్‌పిన్’ అరెస్ట్

18 Nov, 2014 03:06 IST|Sakshi
ఎర్ర ‘కింగ్‌పిన్’ అరెస్ట్

చిత్తూరు(అర్బన్): ఆంధ్ర, కర్ణాటక రా ష్ట్రాల్లో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్‌ను జిల్లా టాస్క్‌ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. ‘కింగ్‌పిన్’గా పేరొందిన బెంగళూరుకు చెందిన కే.రామకృష్ణ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ను చిత్తూరులో సో మవారం అరెస్టు చూపించారు. ఇతనితో పాటు చెన్నైకు చెందిన అయ్యప్పన్ గౌండర్ (34), తిరువళ్లూరుకు చెందిన జీ.కుమార్ (30), తిరునల్వేలికి చెందిన ఎస్.మురుగన్ (41), క్రిష్ణగిరికి చెందిన ఏ. గోవిందరాజ్ (21)ను కుప్పం-క్రిష్ణగిరి ఘాట్ రోడ్డు, వి.కోట-కుప్పం రోడ్డుల్లో అరెస్టు చేసినట్టు చిత్తూరు ఓఎస్డీ రత్న ప్రకటించారు. వీరి నుంచి పెట్రోలి యం ట్యాంకరు, మహీంద్ర కారు, ఓ లారీ, రూ.2.40 లక్షల నగదు, 34 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రత్న, సీఐ రిషికేశవ్ వివరాలు వెల్లడించారు.

స్మగ్లర్ల బయోడేటా

రామకృష్ణ
ఇతనిది బెంగళూరులోని ముల్‌బాగిల్. మదనపల్లెలో నివాసముంటున్నాడు. 9వ తరగతి చదువుకుని లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ రియల్ ఎస్టేట్‌లోకి దిగాడు. అక్కడ లాభాలు రాకపోవడంతో 2008 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 1500 టన్నుల ఎర్రచంద నాన్ని జిల్లా నుంచి ఎగుమతి చేశాడు. ఇతనికి అంతర్జాతీ య స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. కర్ణాటకలో ఎర్రచందనం నిల్వచేసే గో డౌన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఇతనిపై 14 కేసులు ఉన్నాయి. 2010లో ఎర్రచందనం కేసులో ఇతను జైలు శిక్ష అనుభవించాడు. ఎర్రచందనం రవాణా లో ఆరితేరడంతో ఇతన్ని అందరూ ‘కిం గ్‌పిన్’గా పిలుస్తుంటారు. వార్షిక ఆదా యం రూ.6 కోట్లు.
 
అయ్యప్ప గౌండర్..
చెన్నైలోని కొడియంగన్ను ప్రాంతానికి చెందిన అయ్యప్పగౌండర్ దుస్తుల వ్యా పారి. చెన్నైకు చెందిన బట్టల వ్యాపారి శేఖర్ ద్వారా 2008లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి వచ్చాడు. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ స్మగ్లర్లకు ఎర్రచందనం సరఫరా చేయడం మొదలు పెట్టాడు.  దాదాపు వంద టన్నుల వరకు రవాణా చేశాడు. వార్షిక ఆదాయం రూ.2.50 కో ట్లు. ఇతనిపై 8 కేసులు ఉన్నాయి.

కుమార్
తమిళనాడులోని తిరువళ్లూరుకు చెంది న ఇతను పదో తరగతి చదువుకుని డ్రైవర్‌గా పనిచేసేవాడు. మూడేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణాలోకి వ చ్చాడు. ఇతనిపై 8 కేసులు ఉన్నాయి.  వార్షిక ఆదాయం రూ.60 లక్షలు.
 
మురుగన్
ఇతనిది తమిళనాడులోని తరునల్వేలి జిల్లా. బీ.కామ్ వరకు చదువుకుని ట్రా వెల్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉం డేవాడు. అక్రమంగా డబ్బు సంపాదిం చాలని ఎర్రచందనం అక్రమ రవాణాలోకి వచ్చాడు. వంద టన్నులు  ఇతర ప్రదేశాలకు తరలించాడు. జిల్లాలో ఇతనిపై 8 కేసులు ఉన్నాయి. వార్షిక ఆదాయం రూ.2.50 కోట్లు.
 
గోవిందరాజ్
తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్ వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనిపై జిల్లాలో ఆరు కేసులు ఉన్నాయి. ఇతని వార్షిక ఆదాయం రూ.12 లక్షలు.
 
ఇద్దరు ‘ఎర్ర’దొంగల అరెస్ట్
వి.కోట: వి.కోట మీదుగా తమిళనాడుకు ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ శివాంజనేయుులు  తెలిపారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు రహస్య సవూచారం అందింది. పోలీసులు కుప్పం రహదారిలో కాపుగాశారు. పలవునేరు వూర్గం నుంచి కుప్పం వైపునకు వేగంగా వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్‌ను, వుహీంద్రా ఎక్స్‌యుూవీని అనువూనంతో నిలి పారు. వాహనంలో ఉన్నవారు పొంతన లేని సవూధానం చెప్పడంతో తనిఖీ చేశారు. వాహనాల్లో  ఎర్రచందనం దుంగలు ఉండడంతో డ్రరుువర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు వుదనపల్లెకు చెందిన రావుకృష్ణ, తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన గోవిందరాజ్‌గా తేలింది. వారిని రివూం డుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు