‘ఎర్ర’ స్మగ్లర్ వసంత్ లొంగుబాటు

5 Sep, 2014 02:05 IST|Sakshi
‘ఎర్ర’ స్మగ్లర్ వసంత్ లొంగుబాటు

చిత్తూరు(అర్బన్): తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి, చిత్తూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ వసంత్ గురువారం పోలీసులకు లొంగిపోయాడు. ఎర్రచందనం తరలింపులో ఇతనిపై భాకరాపేట, చిత్తూరు వన్‌టౌన్, టూటౌన్‌తో పాటు జిల్లాలో దాదాపు 6 వరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఇతను గురువారం సాయంత్రం తన న్యాయవాదిని వెంట తీసుకొచ్చి చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అనంతరం వైద్య చికిత్సల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు.  ఇతడిని ఇంకా అధికారికంగా అరెస్టు చూపలేదు.
 
కేవీపల్లెలో వేణుగోపాల్‌రెడ్డి అరెస్ట్

కేవీపల్లి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం కటారుముడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ వేణుగోపాల్‌రెడ్డిని కేవీపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపరి చారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ఐదేళ్లుగా వేణుగోపాల్‌రెడ్డి గజ్జల శీన్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. గత ఏడాది నవంబర్ నుంచి అతను పరారీలో ఉన్నాడని, గురువారం జిల్లేళ్లమంద పంచాయతీ దేవాండ్లపల్లి బస్టాప్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు.
 
మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
 
పీలేరురూరల్: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా గుర్తించిన శ్రీశైలం బాబును అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపినట్లు పీలేరు సీఐ టీ.నరసిం హులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. అనంతపు రం జిల్లా తలపుల మండలం పులిగుండ్లపల్లెకు చెందిన చిన్న సల్లప్ప కుమారుడు శ్రీశైలం బాబు అలియాస్ సారాయి బాబు, అలియాస్ శ్రీశైలం వేమనారాయణ (44) 15 ఏళ్ల క్రితం పీలేరుకు వచ్చి సారా వ్యాపారం సాగించేవాడు.

అనంతరం ఏడేళ్లుగా ఎర్రచందనం వ్యా పారం చేస్తున్నాడు. పీలేరు, భాకరాపేట, గానుగచింత, ఎర్రావారిపాళెం, కేవీ పల్లె ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలు కొని చిత్తూరు, బెంగళూరులో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. 2011లో కల్లూరు పోలీసులకు, 2013 లో ఎర్రావారిపాళెం పోలీసులకు పట్టుబడి జైలుకు వెళా ్లడు. గురువారం పీలేరు సీఐ టీ.నరసింహులు, ఎర్రావారిపాళెం పోలీసులు ఎర్రావారిపాళెం మండలంలోని యల్లమందలో అతన్ని అరెస్ట్ చేశారు.
 

మరిన్ని వార్తలు