మన్యంలో రెడ్‌అలెర్ట్

3 Jul, 2015 00:26 IST|Sakshi
మన్యంలో రెడ్‌అలెర్ట్

ఏవోబీలో ముమ్మర  గాలింపు
మావోయిస్టుల కదలికలపై నిఘా

 
పాడేరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పరిధిలోని ఎంబీకే డివిజన్‌లో ఈ నెల 6,7 తేదీల్లో బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మన్యంలో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు. ఈ నెల ఒకటి నుంచి 7వ తేదీ వరకు దళసభ్యులు నిర్బంధ వ్యతిరేక నిరసన దినాలు పాటిస్తున్నారు. దీంతో మారుమూల గూడేల్లో బేనర్లు, పోస్టర్లు అతికించి 6,7 తేదీల్లో బంద్‌ను విజయవంత చే యాలని ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో భద్రత బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి.

కూంబింగ్‌తో ముమ్మర గాలింపు చేపడుతున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా పెరిగింది. మండల కేంద్రాలు, కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా వ్యవస్థ కదలికలపై నిఘా పెంచారు. ప్రజాప్రతినిధులకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో ఏజెన్సీ అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు