‘అసమర్థ పాలన కప్పిపుచ్చుకునేందుకే గిమ్మిక్కులు

9 May, 2018 13:17 IST|Sakshi

శ్రీకాకుళం సిటీ: ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాలీలు నిర్వహించడం తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి శాంతి పేర్కొన్నారు. మంగళవా రం ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశా రు. నాలుగేళ్ల పాలనలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలపై మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలి పారు. అయినా ఏ ఒక్కరోజూ ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అధికారులపై దౌర్జన్యాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. 

టీడీపీ నేరపూరిత నిర్లక్ష్యాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఎండగడుతున్నారని తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీకి చెందిన న లుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు అఫిడవిట్‌లు ఆధారంగా ఏడీఆర్‌(జాతీయ ఎన్నికల పరి శీలన స్వచ్ఛంద సంస్థ) నివేదిక ఇచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 45 మంది ఎమ్మెల్యేల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండడం వారికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ వారిని రక్షించుకునేందుకు సీఎం దొడ్డిదారిన జీఓలు విడుదల చేశారని ఆరోపించా రు. ఈ గిమ్మిక్కులను ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విదంగా చంద్రబా బుకు బుద్ధి చెబుతారని తెలిపారు.  

మరిన్ని వార్తలు