ఎర్ర దందాలో మహిళలు

7 Feb, 2016 03:54 IST|Sakshi
ఎర్ర దందాలో మహిళలు

సాక్షి ప్రతినిధి తిరుపతి:  ప్రధాన ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు, అటవీ సిబ్బంది దృష్టి సారించడంతో ఇంతకుముందు కిందిస్థాయిలో దళారులుగా పనిచేసిన వారు, డ్రైవర్లు, ఇన్‌ఫార్మర్లు పూర్తిస్థాయిలో స్మగ్లర్లుగా మారిపోయారు. వీరు పెద్ద దుంగలను చిన్నచిన్న ముక్కులుగా కట్‌చేసి లగేజీ బ్యాగులో కుక్కి తరలిస్తున్నారు. ఇందుకు సెప్టిక్ ట్యాంకర్లు, కోల్డ్ స్టోరేజీ కంటైనర్లు, అయిల్ ట్యాంకర్లు, బోర్‌వెల్ వాహనాలను వాడుకుంటుండడంతో పోలీసులు   గుర్తించలేకపోతున్నారు. ప్రలోభాల పర్వంఇటీవల పట్టుబడిన తమిళనాడుకు చెందిన కూలీని విచారిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్లు  సమాచారం.

తమిళనాడులో పనిదొరకడం గగనమని, అక్కడి వారిని రోజుకు రూ.500 కూలి ఇప్పిస్తామని కొందరు మేస్త్రీలు నమ్మబలికి ఇక్కడికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ అడవుల్లో కట్టెలు కొట్టే పని అని మభ్యపెడుతున్నట్టు సమాచారం. అడ్వాన్స్‌గా రూ.20 వేలు కూలీలకు ముందుగా రూ.20,000 అడ్వాన్స్ ఇచ్చి, మూడు రోజుల తరువాత పనులకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ డబ్బు ఖర్చుపెట్టేయడంతో అది తీర్చలేక విధిలేని పరిస్థితుల్లో ఎర్ర ఉచ్చులోకి దిగాల్సి వస్తున్నట్టు సమాచారం. ఇక్కడ పనికి వచ్చాక పోలీసులకు పట్టుబడకపోతే నెలకు రూ.50వేల వరకు గిట్టుబాటవుతుండడంతో కూలీలు అన్నిం టికీ తెగిచ్చి వస్తున్నట్టు తెలుస్తోంది.

 ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు టాస్క్‌ఫోర్స్ కొత్త ప్రయోగం చేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి షార్ట్‌ఫిలిం రూపొందించనున్నట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు, ప్రముఖ రంగస్థల నటుడు శ్రీనివాసులు దీక్షితులతో కలిసి ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. మొదటి విడతలో రెండు షార్ట్ ఫిలింలు తీయనున్నారు. ఎర్రచందనం ప్రాముఖ్యత, దీన్ని ఎందుకు తరలిస్తున్నారు.. విదేశాల్లో దీనికి ఎందుకంత డిమాండ్ .. దీని వల్ల లాభపడేవారు ఎంతమంది అనే అంశాల ప్రాధాన్యతగా షార్ట్ ఫిలింలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఎర్రదందాలో కూలీలు ఎలా బలవుతున్నారు.. పట్టుబడిన పెద్ద స్మగ్లర్లు జైలు పాలై.. సంఘంలో ఎలా అగౌరవ పడుతున్నారో తెలియజేసే విధంగా షార్ట్ ఫిలింలు రూపొందిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

>
మరిన్ని వార్తలు