తొలి ఏడాదిలోనే 20% మద్యం షాపులు తగ్గింపు

17 Aug, 2019 04:23 IST|Sakshi

దశలవారీ మద్యపాన నిషేధం దిశగా అడుగులు

మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం 

ఇప్పటివరకు 4,380 షాపులుండగా వీటిలో 880 షాపుల తగ్గింపు 

ప్రభుత్వ మద్యం దుకాణాలు 3,500గా ప్రకటన 

వీటిలో 15 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ ఏడాది (2019–20)కి మద్యం పాలసీని ప్రకటించింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా.. దశలవారీ మద్యపాన నిషేధానికి అనుగుణంగా.. అక్టోబర్‌ 1 నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,380 మద్యం షాపులుండగా తొలి ఏడాదే వీటిలో 880 తగ్గించి 3,500కి కుదించింది. వీటిని ప్రభుత్వమే నిర్వహించనుంది. షాపులను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఏర్పాటు చేయనుంది. వీటికి ఏపీఎస్‌బీసీఎల్‌ రిటైల్‌ ఔట్‌లెట్‌గా నామకరణం చేస్తారు. వీటిపై షాపు నెంబర్‌ కూడా ఉంటుంది. జిల్లాలవారీగా షాపుల సంఖ్యపై ఎక్సైజ్‌ కమిషనర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తారు. 

షాపుల ఏర్పాటుపై విధివిధానాలివే..
- మద్యం షాపులను ఎక్సైజ్‌ చట్టం–1968 రూల్స్‌ ప్రకారం ఏర్పాటు చేయాలి. ఒక్కో షాపు 150 చదరపు అడుగుల నుంచి 300 చదరపు అడుగుల లోపు ఉండాలి. పక్కా నిర్మాణంతో రోడ్డుకు అభిముఖంగా, ఒకే డోర్‌తో నిర్మించాలి. మొదటి అంతస్తులోనే షాపు ఉండాలి. ఎమ్మార్పీ ధరలను సూచించే బోర్డును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి.
మద్యం షాపులో సీలింగ్‌ ఫ్యాన్లు, టేబుళ్లు, కుర్చీలు, ఐరన్‌ ర్యాక్‌లు, ఎలక్ట్రికల్‌ సబ్‌ మీటర్, దొంగ నోట్లను గుర్తించే డిటెక్టర్, సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ఉండాలి.
ఏడాదికి మాత్రమే షాపు అద్దె అగ్రిమెంట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత టైమ్‌ టు టైమ్‌ పొడిగించుకోవాలి.
ప్రతి మద్యం షాపులో అర్బన్‌ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉంటారు. అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి మద్యం షాపులో ఒక సూపర్‌వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్, ఒక వాచ్‌మెన్, గ్రామీణ ప్రాంతాల్లోని షాపులో సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్, ఒక వాచ్‌మెన్‌ ఉంటారు.
షాపు సూపర్‌వైజర్‌కు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండి, మద్యం షాపు ఎక్కడ ఏర్పాటవుతుందో ఆ మండలానికి చెందినవారై ఉండాలి. విద్యార్హత డిగ్రీ. బీకాం ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది. షాపు సేల్స్‌మెన్‌కు ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణతతోపాటు స్థానికులై ఉండాలి. సూపర్‌వైజర్‌కు నెలకు రూ.17,500 జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, సేల్స్‌మెన్‌కు నెలకు రూ.15 వేల జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పిస్తారు. 

కాంట్రాక్టు విధానంలో సిబ్బంది ఎంపిక
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మొత్తం 15 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత అర్హులైనవారు ఆన్‌లైన్‌లో ఏపీఎస్‌బీసీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారికి కాంట్రాక్టు విధానంలో ఏడాది పాటు మద్యం షాపులో పనిచేసే అవకాశం ఉంటుంది. సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను ఆయా డిపో మేనేజర్‌ అనుమతితో ఇస్తారు. సూపర్‌వైజర్‌ లేదా సేల్స్‌మెన్‌ సేవలు సంతృప్తిగా ఉంటే వారిని రెండో ఏడాది కొనసాగించవచ్చు. రెండో ఏడాదిలో ఓ నెల రెమ్యునరేషన్‌ను బోనస్‌గా ఇస్తారు. మద్యం షాపులో రోజువారీ లావాదేవీలు, స్టాకు రిజిస్టర్ల నిర్వహణ, డిపో మేనేజర్‌ సూచించే పనులను సూపర్‌వైజర్‌ నిర్వహించాలి. వినియోగదారుల బిల్లింగ్, మద్యం బాటిళ్ల లోడింగ్, సూపర్‌వైజర్‌ సూచించే బాధ్యతలను సేల్స్‌మెన్‌ నిర్వహించాల్సి ఉంటుంది. మద్యం షాపును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడపాలి. మద్యం షాపులో ఏదైనా నష్టం సంభవిస్తే సిబ్బందిదే పూర్తి బాధ్యత. జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు మద్యం షాపుల ఏర్పాటు, రవాణా, సిబ్బంది ఎంపికలను పర్యవేక్షిస్తాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లైన్లు లేకున్నా లైన్‌ క్లియర్‌!

కృష్ణమ్మ మహోగ్రం!

టీడీపీ ‘డ్రోన్‌’ రాద్ధాంతం

పరిశ్రమల స్థాపనకు ఒక్క దరఖాస్తు చాలు : సీఎం జగన్‌

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కన్నబాబు

రివర్స్‌ టెండరింగ్‌కు మార్గదర్శకాలు విడుదల

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం జగన్‌కు అమెరికాలో ఘన స్వాగతం

పిడుగుపాటుకు మహిళ మృతి

నలుగురి హత్యకు కుట్ర.. అరెస్టు

కరకట్ట లోపల భవనాలను పరిశీలించిన మంత్రులు

‘వరదకు చెబుదామా చంద్రబాబు ఇంట్లోకి రావొద్దని..’

లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు: ఆర్కే

‘సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్నారు’

‘చంద్రబాబూ.. ఇక డ్రామాలు ఆపు’

దేవినేని ఉమా ఓ పిచ్చోడు

వైద్య సేవలపై గవర్నర్‌ ఆరా!

‘కార్పొరేట్‌ ఆస్పత్రికి ధీటుగా తీర్చిదిద్దాలి’

కృష్ణలంకలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల పర్యటన

శక్తివంచన లేకుండా సమగ్రాభివృద్ధి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

కనుల పండువ...  స్వాతంత్య్ర వేడుక...

108 అడుగుల స్తంభంపై జాతీయ జెండా

వీఆర్‌ఓ మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ఎమ్మెల్యే కారుమూరి సోదరుడు మృతి 

స్థానిక సమరానికి సై

అగ్రగామిగా విజయనగరం

కన్నీటి వర్షిణి!

రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

బంధాలు మళ్లీ గుర్తొస్తాయి