ఇదేం ‘పంచాయతీ’

14 Jan, 2014 06:30 IST|Sakshi

 ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో 29 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడానికి 2013 డిసెంబర్ మెదటి వారంలో అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కేటగిరీల అభ్యర్థులు మొత్తం 5,500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగ అభ్యర్థులతో పాటు పని చేస్తున్న కాంట్రాక్టు కార్యదర్శులు కూడా ఇం దులో దరఖాస్తు చేసుకోవాలని, సర్వీసును గుర్తించి డిగ్రీ మార్కులే కాకుండా 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
 
 అయితే, తమను రెగ్యులర్ చేస్తానని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇపుడు అన్యాయం చేస్తోందంటూ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 24 మంది కాంట్రాక్టు కార్యదర్శులు డిసెంబర్ 10న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, వారు పని చేస్తున్న పోస్టులను భర్తీ చేయకూడదని ట్రిబ్యునల్ జనవరి మొదటి వారం లో తీర్చు నిచ్చింది. కాంట్రాక్టు కార్యదర్శులుగా పని చేస్తున్న వారిలో ఇంటర్ అర్హత ఉంటే వారికి డిగ్రీ పూర్తి చేసే వరకు సమయాన్ని ఇచ్చి, ఆ తరువాత వారిని రెగ్యులర్ చేస్తూ నియమక పత్రాలు ఇవ్వాల ని సూచించింది. ఈ తీర్పు కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ 29 పోస్టుల భర్తీకి అధికారులు జారీ చేసిన నోటిపికేషన్ విషయంలో ఏం చేయాలో ట్రిబ్యునల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలే దు. దీంతో జిల్లా పంచాయతీ అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అయితే ట్రిబ్యునల్ ఉత్తర్వులు తమకు ఇంకా చేరలేదని చెబుతున్నారు.
 
 దరఖాస్తులు చేసుకున్నవారి పరిస్థితేంది
 ట్రిబ్యునల్ కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలం గా ఇవ్వడంతో.. 29 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగుల పరిస్థితి అయోమయంగా మా రింది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణ ఖర్చులు పెట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చి ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. బీసీలు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.50 డీడీ కూడా కట్టారు. ఈ మొత్తం నిధులు రూ.2లక్షలకు పైగా డీపీఓ ఖాతాలో జమ అయ్యాయి. ఉచితంగా దరఖాస్తులు చేసుకున్న వారేమేగాని,డబ్బులు ఖర్చు చేసి దరఖాస్తు చేసుకున్న వారినుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నా యి. ఈ తికమకపై పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్‌తో లేదా ప్రభుత్వంతో చర్చించనున్నారు.
 
 స్పష్టత వచ్చే వరకు భర్తీ చేయం
 - సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి
 ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పు కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలంగా ఉంది. కాని 29 పోస్టుల భర్తీకి మేం ఇచ్చిన నోటిఫికేషన్, పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల విషయంలో ఏం చేయాలని కోర్టు సూచించిందో తెలియదు. ఉత్తర్వులను పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అప్పటి వరకు కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ గాని, పోస్టుల భర్తీ గాని చేయబోం.
 

>
మరిన్ని వార్తలు