భూ వివాదాల పరిష్కారానికే క్రమబద్ధీకరణ

17 Jan, 2015 01:54 IST|Sakshi
  • భూపరిపాలన విభాగం స్పెషల్ కమిషనర్ అధర్ సిన్హా
  • సాక్షి, హైదరాబాద్ : ఎన్నోఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి, ప్రభుత్వానికి మధ్య కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ వివాదాలు పరిష్కారమయ్యేందుకు చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియ దోహదపడుతుందని భూపరిపాలన విభాగం స్పెషల్ కమిషనర్ అధర్ సిన్హా అన్నారు.

    శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ..  ప్రభుత్వం పథకాల ద్వారా ఎక్కువమంది ప్రజలకు మేలు చేకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ కార్యాలయంలో స్పెషల్ కమిషనర్‌గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి అధర్ సిన్హా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

>
మరిన్ని వార్తలు