కన్న ప్రేమంటే ఇంత చీదరింపా?

9 Jan, 2020 13:19 IST|Sakshi
చెట్టు కింద చలిలో వణుకుతున్న వృద్ధుడు ,వృద్ధుడికి దుప్పటి కప్పి ఆహారం ఇచ్చిన వాకర్స్‌

ఉండూరు రోడ్డులో చెట్టు కింద వృద్ధుడిని విడిచిన బంధువులు

చలిగాలిలో అవస్థలు  

నోటి మాట రాని వృద్ధుడు గమనించిన వాకర్స్‌

తూర్పుగోదావరి,సామర్లకోట: ఆ వృద్ధుడు ఎవరికి భారమయ్యాడో కానీ అనాథగా ఓ చెట్టు కింద ఇలా కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం ఉండూరు రోడ్డులో రైల్వే గేటు సమీపంలోని ఓ చెట్టు కింద సుమారు 70 ఏళ్ల వృద్ధుడు పడి ఉన్నాడు. ఆ రోడ్డులో సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న వారు ఇది గమనించి మద్యం సేవించి పడిపోయి ఉంటాడని భావించారు. సాయంత్రం కూడా అతడు అలాగే చలిగాలికి వణికిపోతూ కనిపించడంతో వాకర్స్‌ చలించిపోయారు.

ఆ వృద్ధుడికి దుప్పటి ఇచ్చి తాగునీరు, ఆహారం అందించారు. ఈ వృద్ధుడిని మూడు రోజుల క్రితం మోటారు సైకిల్‌పై వచ్చిన వారు వదిలి వెళ్లి పోయారని సమీపంలో ఉన్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. మద్యం మత్తులో ఉండడం వల్ల విడిచి వెళ్లారని భావించామని తెలిపారు. అయితే వృద్ధుడి నుంచి సమాచారం తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా నోటి నుంచి మాట స్పష్టంగా రావడం లేదు. అయితే గ్రామం మాత్రం మాధవపట్నం అని చెప్పగలిగాడు. ఈ పెద్దాయనను  ఎవరో కర్కశులు ఈ విధంగా చలిలో వదిలి వెళ్లిపోవడంతో స్థానికుల హృదయాలు చలించిపోయాయి. పోలీసులు ఈ వృద్ధుడిని రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చంద్రబాబు చేతకాని చరిత్రహీనుడు’

ఏనుగులను కవ్వించొద్దు

రైలు పట్టాలపై.. రుధిర ధారలు

మెట్రో.. సరికొత్తగా..

‘చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’

సినిమా

దీపిక నిర్మాత.. పబ్లిసిటీ స్టంట్‌ అయితే ఏంటి?

చీరకట్టులోనే యాక్షన్‌ ఫీట్‌

తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి

ఈ బంధంలో.. ఆ రెండు మాత్రమే...!

నటి ప్రేమాయణం.. విషం తాగిన తల్లి

దర్బార్‌: ట్విటర్‌లో ఏమంటున్నారంటే?