గ్రామసచివాలయాల్లో కొలువుల జాతర

28 Jul, 2019 09:05 IST|Sakshi

గ్రామ సచివాలయాల్లో 8,110 ఉద్యోగాలు 

వార్డు సచివాలయాల్లో దాదాపు 3 వేల పోస్టులు 

ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 

సెప్టెంబర్‌ 1న రాత పరీక్ష 

సాక్షి, కర్నూలు(అర్బన్‌)/టౌన్‌: ఉద్యోగాల విప్లవం మొదలైంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. జిల్లాలోని 879 గ్రామ సచివాలయాల్లో 8,110 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే 300 వార్డు సచివాలయాల్లో దాదాపు మూడు వేల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 26వ తేదీ రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలోని మొత్తం 909 గ్రామ పంచాయతీల్లో జనాభాను పరిగణనలోకి తీసుకుని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను అధికారులు నిర్ధారించారు. వార్డు సచివాలయాల విషయంలోనూ ఇదే పద్ధతి పాటించారు.ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 27 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

సెప్టెంబర్‌ ఒకటో తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సంక్షేమ పథకాల అమల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు వాటిని పారదర్శకంగా అర్హులకు అందించేందుకు గ్రామ సచివాలయాల్లో 13 రకాల పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 879 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అయితే గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా ఇంకా రెండు లేక మూడు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపామని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్‌ ప్రభాకర్‌రావు చెప్పారు.   

300 వార్డు సచివాలయాలు 
జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్య  ఆధారంగా ప్రభుత్వం 300 వార్డు సచివాలయాలను ఖరారు చేసింది. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమించనున్నారు. ఈ లెక్కన దాదాపు మూడు వేల మంది ఉద్యోగులను తీసుకుంటారు. వార్డు కార్యదర్శి (సాధారణ పరిపాలన శాఖ), మౌలిక వసతుల కార్యదర్శి (గ్రేడ్‌–2 ), శానిటేషన్‌ కార్యదర్శి (గ్రేడ్‌–2 ), విద్యా కార్యదర్శి, ప్లానింగ్‌ కార్యదర్శి,  సంక్షేమం, అభివృద్ధి కార్యదర్శి  (గ్రేడ్‌–2), ఆరోగ్య కార్యదర్శి,  రెవెన్యూ కార్యదర్శి, మహిళా కార్యదర్శి పోస్టులకు ఎంపిక చేస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిధుల కొరత లేదు: మంత్రి బుగ్గన

టిక్‌‘ట్రాప్‌’లో శక్తి టీమ్‌ 

ఆ భోజనం అధ్వానం

మంత్రి అవంతి గరం గరం..

రైల్వే ప్రయాణికుడి వీరంగం

వీరులార మీకు పరి పరి దండాలు!

చేతకాకపోతే చెప్పండి.. వెళ్లిపోతాం!

అమాయకుడిపై ఖాకీ ప్రతాపం 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

80% ఉద్యోగాలు స్థానికులకే.. 

నా కుమారుడు చచ్చినా పర్వాలేదు

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

దావోస్‌లో ఏపీ లాంజ్‌ ఖర్చు రూ.17 కోట్లు

ప్రభుత్వ మద్యం షాపులకు ప్రతిపాదనలు సిద్ధం!

యజ్ఞంలా ‘నివాస స్థలాల’ భూసేకరణ 

‘జగతి’ ఎఫ్‌డీఆర్‌ను వెంటనే విడుదల చేయండి 

ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఇక పక్కాగా..

విశాఖ ఏజెన్సీని ముంచెత్తిన వర్షాలు

గాంధీ జయంతి నుంచి.. గ్రామ సురాజ్యం

పెట్టబడుల ఆకర్షణకై రాష్ట్ర ప్రభుత్వం భారీ సదస్సు

ఈనాటి ముఖ్యాంశాలు

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

బాధ్యతలు చేపట్టిన ఆర్టీజీఎస్‌ నూతన సీఈవో

పొనుగుపాడు ఘటనపై స్పందించిన హోంమంత్రి

‘చంద్రబాబు డైరెక‌్షన్‌లో మందకృష్ణ మాదిగ’

‘వర్గీకరణకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదు’

వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం

గత ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా?

వ్యయమా.. స్వాహామయమా..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!