హైకోర్టులో ఐఏఎస్ అధికారి రత్నప్రభకు ఊరట

18 Jun, 2014 18:50 IST|Sakshi
హైకోర్టులో ఐఏఎస్ అధికారి రత్నప్రభకు ఊరట
హైదరాబాద్: ఇందూటెక్ జోన్ కేసులో ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు హైకోర్టులో ఊరట లభించింది. రత్నప్రభపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టిందని రత్నప్రభ హైకోర్టుకు తెలిపింది. ఇందూటెక్‌ భూవివాదంలో తన పాత్రేమీలేదంటూ రత్నప్రభ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. 
 
ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను అధికారులుగా విధులను నిర్వహించామని రత్నప్రభ కోర్టుకు వెల్లడించింది. నేరపూరిత వ్యక్తులకు, బాధ్యతయుతమైన అధికారుల మధ్య తేడాను సీబీఐ గమనించాలని ఆమె కోర్టుకు తెలిపింది. జగన్ ఆస్తుల కేసులో రత్నప్రభపై సీబీఐ చార్జిషీట్ ను దాఖలు చేశారు. 
మరిన్ని వార్తలు