జేసీ దివాకర్‌ రెడ్డికి ఊరట...

19 Jul, 2017 16:03 IST|Sakshi
జేసీ దివాకర్‌ రెడ్డికి ఊరట...

హైదరాబాద్‌: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఊరట లభించింది. దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు ఆయనపై విధించిన నిషేధాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ బుధవారం ఎత్తివేసింది. కాగా గత నెల విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో బోర్డింగ్‌ పాస్‌ను నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో జేసీ గొడవపడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా  ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎయిర్‌ ఇండియా ఇతర ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఆయన ప్రయాణంపై నిషేధం విధించాయి. దీనిపై జేసీ దివాకర్‌ రెడ్డి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.

దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా విమానయాన సంస్థలను ఆదేశించాలని కోరారు. అయితే నిషేధంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీకి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది.  జేసీపై నిషేధం విధించిన ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్, ఇండిగో, గో ఎయిర్, ఎయిర్‌ ఏసియా, స్పైస్‌ జెట్, టర్బో మెగా ఎయిర్‌ వేస్‌ తదితర విమాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది.  పౌర విమానాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌లకు కూడా నోటీసులు ఇచ్చింది. 

మరిన్ని వార్తలు