కోర్టు జోక్యంతో ఊరట

23 Feb, 2014 01:15 IST|Sakshi

 ‘షార్జా’లో కంపెనీ బాధితుల క్వార్టర్స్‌లో సౌకర్యాల
     పునరుద్ధరణ
     బకాయిల చెల్లింపునకు
     గడువు కోరిన కంపెనీ
     పక్షం రోజుల్లో స్వగ్రామాలకు రానున్న కార్మికులు
 
 మోర్తాడ్, న్యూస్‌లైన్ :
 షార్జాలోని ఆల్ కరమ్ జనరల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేసిన కార్మికులకు అక్కడి హైకోర్టు బాసటగా నిలిచింది. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో కార్మికుల కుటుంబ సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కార్మికులు శనివారం ‘న్యూస్‌లైన్’కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు.
 
 అసలేం జరిగింది
 ఆల్ కరమ్ జనరల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ప నిచేస్తున్న సుమారు 200 మంది కార్మికులకు కంపెనీ వేతనాలు చెల్లించడం లేదు. దీంతో అక్కడ ఉండడం కష్టంగా మారడంతో చాలా మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన సుమారు 25 మంది కార్మికులు అక్కడే ఉండిపోయారు. కంపెనీ వైఖరిపై అక్కడి లేబర్, హైకోర్టులను ఆశ్రయించారు. కార్మికులకు అనుకూలంగా కోర్టులు తీర్పు ఇచ్చాయి. కంగుతిన్న కంపెనీ కార్మికులపై వేధింపులకు దిగింది. క్వార్టర్లకు విద్యుత్, నీరు, గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది. దీంతో కార్మికులు వీధిన పడాల్సి వచ్చింది. కార్మికులు ఇండియన్ ఎంబసీ అధికారులను కలిసి హైకోర్టు ఇచ్చిన తీర్పును కంపెనీ అమలు చేసేలా చూడాలని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో చెత్త ఏరి, విక్రయించి పొట్టపోసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
 
 మళ్లీ కోర్టుకు..
 కార్మికులు వారం క్రితం మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన తీర్పును కంపెనీ అమలు చేసేలా చూడాలని కోరారు. స్పందించిన కోర్టు నాలుగు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. కార్మికులకు వేతన బకాయిలను చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. అప్పటివరకు క్వార్టర్లలోనే ఉంటారని, వాటి కి సౌకర్యాలు పునరుద్ధరించాలని పేర్కొంది. దీంతో కంపెనీ స్పందించి క్వార్టర్లకు సౌకర్యాలను పునరుద్ధరించింది. వేతనాల బకాయి లు చెల్లించడానికి గడువు కావాలని కంపెనీ హైకోర్టును కోరింది. 10 రోజుల్లో బకాయిల ను కోర్టులో డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బకాయిలను కంపెనీ డిపాజి ట్ చేయకపోతే కంపెనీ యజమానిని అరెస్టు చేసే అవకాశం ఉంటుందని కార్మికులు తెలి పారు. అందువల్ల గడువులోగా వేతనాలు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేతనాలు చేతికి అందగానే స్వదేశానికి పయనమవుతాయని తెలిపారు. భారత రాయబార కార్యాలయం అధికారులు తమపై కనికరం చూపకపోయినా అక్కడి హైకోర్టు బాసటగా నిలచిందని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా