గంగాధరానికి రిమాండ్‌ పొడిగింపు

13 Apr, 2017 18:52 IST|Sakshi

విశాఖపట్నం: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఏపీ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ గంగాధరానికి ఈనెల 27 వరకు విశాఖ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. హైదరాబాద్‌లో ఆర్‌ అండ్‌బీ శాఖలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేసిన గంగాధరం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన నివాసం, బంధువులు, అనుచరుల ఇళ్లలో ఈ నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 16 చోట్ల అవినీతి నికరోధక శాఖ దాడులు చేసిన విషయం విదితమే.

ఈ సోదాల్లో మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ.150 కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. గంగాధరాన్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 13 వరకూ రిమాండ్‌ విధించారు. గురువారంతో ఆ గడువు ముగియడంతో మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు