జ్యూట్‌ మిల్లు తెరిపించి ఉపాధి కల్పించాలి

20 Sep, 2018 07:08 IST|Sakshi

అన్నా చిట్టివలస జ్యూట్‌మిల్లు 2009లో లాకౌట్‌ అయింది. సుమారు 6,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  జ్యూట్‌మిల్లును తెరిపిస్తామని మా ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు హమీ ఇచ్చారు. తీరా గెలిచాక ఈ సంగతి పట్టించుకోకుండా మోసం చేశారన్నా అంటూ ప్రసాదరెడ్డి పాదయాత్రలో  జగన్‌మోహన్‌రెడ్డిని కలసి మొరపెట్టుకున్నాడు. వేలాదిమంది కార్మికుల భవితవ్యం దీనిపై ఆధారపడి ఉందన్నా. ఎలాగైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లాకౌట్‌ ఎత్తివేసి మిల్లును తెరిపిస్తే తిరిగి  అందరికీ ఉపాధి లభిస్తుందని ఆయన కోరాడు.
 

మరిన్ని వార్తలు