నన్ను ఇంటికి తీసుకెళ్లండి

3 Feb, 2015 02:49 IST|Sakshi
నన్ను ఇంటికి తీసుకెళ్లండి

ఆస్పత్రిలో ఉండలేన ంటూ స్వైన్‌ఫ్లూ బాధితుడు వినతి
నచ్చజెప్పిన వైద్య ఆరోగ్యశాఖ
 

అనంతపురం మెడికల్ : ‘ఈ వార్డులో ఒక్కన్నే బిక్కు బిక్కుమంటు ఉండాలి.. నాతో ఎవరూ మాట్లాడరు... నేనెందుకుండాలి... దీని కంటే చనిపోయేదే మేలేమో...నన్ను ఇంటికి తీసుకెళ్లండి’ అంటూ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ బాధితుడు మహ్మద్‌యాసిన్ ఖురేషి(64) తన కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది వద్ద మొరపెట్టుకున్నాడు. ఇక్కడ ఉండేది లేదు, నాకు ఆరోగ్యంగా బాగానే ఉందని...నాకేం కాదంటూ బిగ్గరగా అరిచాడు.

సిబ్బంది ఎంత చెప్పినా వినలేదు. దీంతో ఆస్పత్రిలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఎక్కడ బయటకు వెళ్లిపోతాడోనన్న భయం సిబ్బందిలో కల్గింది. విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ ఎపిడమిక్ టీం సభ్యులు రామకృష్ణ, ధర్మసింగ్ ఆస్పత్రికి పరుగున వచ్చారు. ఖురేషీకి నచ్చజెప్పారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాస్క్‌లు ధరించి అప్పుడప్పుడు వెళ్లి మాట్లాడించాలని తెలిపారు. మీకు ముందస్తుగా మెడిసన్ ఇచ్చినందు వల్ల మాస్క్‌లు ధరించి దూరం నుంచే మాట్లాడితే సరిపోతుందని వివరించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు