సీఎం బంధువులమంటూ దౌర్జన్యం

12 Jun, 2015 04:19 IST|Sakshi

ఎస్సీలపై దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి
 
 గూడూరు టౌన్ : ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో తోటలు సాగుచేసుకుని కోసుకునేందుకు వెళ్లిన దళితులను సీఎం బంధువులమని చెబుతూ  దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం వెంకటగిరి డివిజన్ కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేసారు. ఈ మేరకు గురువారం వినతిపత్రం అందజేసారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో నారా చంద్రబాబునాయుడు తోట సర్వే నంబరు 139-8బీ16లో సీలింగ్ భూమి ఉందన్నారు.

2004 లో ఈ భూమిని ఆ గ్రామ ఎస్సీ, ఎస్టీలకు చెందిన 18 మందికి ఆర్‌సీ నంబరు 131-2002 ప్రకారం ఒక్కొక్కరికి 0.77 సెంట్ల చొప్పున 13.86 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని చెప్పారు. అప్పటి నుంచి ఆ భూముల్లో ఉన్న మామిడి తోటలు సాగుచేసుకుంటూ ఎస్సీలు అనుభవిస్తున్నారని తెలిపారు. సీఎం బంధువులమని చెపుతున్న మురళీనాయుడు, దొరస్వామినాయుడు, చిన్నప్పనాయుడు అనే వ్యక్తులు ఎస్సీలను తోటల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి పండ్లు కోయక పోవడంతో రాలిపోతున్నాయన్నారు.  అధికారులు తక్షణమే స్పందించి ఎస్సీలకు న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఎం నాయకులు యాదగిరి ఉన్నారు.

మరిన్ని వార్తలు