స్వచ్ఛ గోదావరి నిధులెక్కడ

13 Feb, 2015 00:48 IST|Sakshi
స్వచ్ఛ గోదావరి నిధులెక్కడ

 ఏలూరు :పుష్కరాల నేపథ్యంలో గోదావరి నదికి సమీపంలోని 60 గ్రామాల్లో మరుగుదొడ్లు, డ్రెయిన్లు నిర్మించేం దుకు నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ‘స్వచ్ఛ గోదావరి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పనులు చేపడతామని కేంద్ర తాగునీటి, పారిశుధ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని గత ఏడాది నవంబర్‌లో ఆదేశాలిచ్చింది. ప్రతిపాదనలు రూపొందించిన జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) ఈ పనులకు రూ.45 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే, నేటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పనుల ఊసెత్తడం లేదు.
 
 కేంద్రం ఇస్తానన్న నిధులతో గోదావరి నదిని ఆనుకుని ఉన్న ఆచంట, యలమంచిలి, కొవ్వూ రు, నరసాపురం, నిడదవోలు, పెనుగొండ, పెరవలి, తాళ్లపూడి, పోల వరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని 60 గ్రామాల్లో వివిధ పనులు చేపట్టాలని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం తలపోసింది. స్వచ్ఛ గోదావరి కార్యక్రమం కింద 16వేల మరుగుదొడ్లు నిర్మించాలని, పుష్కరాలకు లక్షలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం ఆయా మండలాల్లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించాల్సి ఉందని ప్రతిపాదించారు. 60 గ్రామాల్లో డ్రెరుునేజీ వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేయాలని భావిం చారు. ప్రతిపాదనలు పంపి మూడు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధుల ఊసెత్తడం లేదు.
 చివరి క్షణాల్లో
 
 నిధులిస్తే ప్రయోజనం లేదు
 పుష్కరాల పనులకు అన్ని శాఖలు టెండర్లు పిలుస్తున్నారుు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న నిధులు ఊడిపడకపోవడంతో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఏం చేయూలో తెలియక దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో నిధులు విడుదల చేస్తే పనులు చేపట్టలేక ఇబ్బం దులు పడతామన్న అభిప్రాయం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నిధుల విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా పంచాయతీ అధికారి ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు.

 

మరిన్ని వార్తలు