మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు..

8 Mar, 2020 16:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి రిజర్వేషన్లు ఖరారు చేశామని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేషన్లలో 672 డివిజన్లు, మున్సిపాలిటీల్లో 2,123 వార్డులకు కోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు ప్రకటించామని పేర్కొన్నారు. 33 శాతానికిపైగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. 16 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. మూడు కార్పొరేషన్‌లకు కోర్టు వివాదాలు ఉన్నాయని చెప్పారు. 103 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు పూర్తయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 74 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, 29  మున్సిపాలిటీల్లో విలీన, కోర్టు సమస్యల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని విజయ్‌కుమార్‌ తెలిపారు. (ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా)

ఏపీలో 103 మున్సిపల్/నగరపంచాయతీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్లలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు.
ఎస్టీ మహిళలకు రెండు స్థానాలు, ఎస్టీ జనరల్ ఒక స్థానం
ఎస్సీ జనరల్ ఏడు స్థానాలు, ఎస్సీ మహిళ ఏడు స్థానాలు
బీసీ జనరల్ 17 స్థానాలు, బీసీ మహిళ 17 స్థానాలు
జనరల్ మహిళ 26 స్థానాలు, జనరల్ 26 స్థానాలు

శ్రీకాకుళం: ఆమదాలవలస-బీసీ మహిళ, ఇచ్చాపురం-జనరల్ మహిళ
పలాస- బీసీ జనరల్, పాలకొండ(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ

విజయనగరం: బొబ్బిలి- బీసీ జనరల్, పార్వతీపురం- బీసీ మహిళ
సాలూరు- జనరల్ మహిళ, నెల్లిమర్ల(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ

విశాఖ: నర్సీపట్నం- ఎస్సీ మహిళ, యలమంచిలి- బీసీ మహిళ

తూర్పుగోదావరి: అమలాపురం- జనరల్ మహిళ, మండపేట- బీసీ మహిళ
పెద్దాపురం- బీసీ మహిళ, పిఠాపురం- జనరల్ మహిళ
రామచంద్రపురం- జనరల్ మహిళ, సామర్లకోట- జనరల్ మహిళ
తుని- జనరల్ మహిళ, గొల్లప్రోలు(నగరపంచాయతీ)- జనరల్ మహిళ
ముమ్మిడివరం(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్
ఏలేశ్వరం(నగరపంచాయతీ)- బీసీ మహిళ

పశ్చిమగోదావరి: భీమవరం- బీసీ మహిళ, నర్సాపురం- బీసీ మహిళ
పాలకొల్లు- జనరల్, తాడేపల్లిగూడెం- జనరల్ మహిళ
కొవ్వూరు- ఎస్సీ మహిళ, నిడదవోలు- జనరల్, 
తణుకు- జనరల్ మహిళ, ఆకివీడు(నగరపంచాయతీ)- బీసీ మహిళ
జంగారెడ్డిగూడెం(నగరపంచాయతీ)- జనరల్ మహిళ

కృష్ణా: గుడివాడ- జనరల్, జగ్గయ్యపేట- బీసీ జనరల్
నూజివీడు- జనరల్ మహిళ, పెడన- బీసీ మహిళ
కొండపల్లి- బీసీ జనరల్, ఉయ్యూరు(నగరపంచాయతీ)- జనరల్
నందిగామ(నగరపంచాయతీ)- జనరల్ మహిళ
తిరువూరు(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్

గుంటూరు: బాపట్ల- జనరల్ మహిళ, చిలకలూరిపేట- జనరల్
మాచర్ల- బీసీ జనరల్, మంగళగిరి- బీసీ మహిళ
నర్సరావుపేట- జనరల్, పిడుగురాళ్ల- జనరల్
పొన్నూరు- ఎస్సీ మహిళ, రేపల్లె- ఎస్టీ మహిళ
గుంటూరు: సత్తెనపల్లి- జనరల్ మహిళ, తాడేపల్లి- ఎస్సీ జనరల్
తెనాలి- జనరల్ మహిళ, వినుకొండ- బీసీ జనరల్
దాచేపల్లి(నగరపంచాయతీ)- జనరల్ మహిళ
గురజాల(నగరపంచాయతీ)- జనరల్ మహిళ

ప్రకాశం: చీరాల- జనరల్, కందుకూరు- జనరల్ మహిళ
మార్కాపురం- జనరల్, దర్శి(నగరపంచాయతీ)- జనరల్
అద్దంకి(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ
చీమకుర్తి(నగరపంచాయతీ)- బీసీ జనరల్
గిద్దలూరు(నగరపంచాయతీ)- బీసీ జనరల్
కనిగిరి(నగరపంచాయతీ)- బీసీ జనరల్

నెల్లూరు: ఆత్మకూరు- ఎస్టీ జనరల్, గూడూరు- జనరల్
కావలి- జనరల్ మహిళ, సూళ్లురుపేట- జనరల్
వెంకటగిరి- బీసీ మహిళ, నాయుడుపేట- ఎస్సీ జనరల్
బుచ్చిరెడ్డిపాలెం(నగర పంచాయతీ)- బీసీ మహిళ

చిత్తూరు: మదనపల్లె- జనరల్ మహిళ, పుంగనూరు- జనరల్
పలమనేరు- బీసీ మహిళ, నగరి- బీసీ జనరల్
శ్రీకాళహస్తి- ఎస్టీ జనరల్, పుత్తూరు- ఎస్సీ జనరల్, కుప్పం- జనరల్

అనంతపురం: ధర్మవరం- బీసీ మహిళ, గుత్తి- జనరల్ మహిళ
గుంతకల్- జనరల్ మహిళ, హిందూపురం- జనరల్
కదిరి- జనరల్ మహిళ, కల్యాణదుర్గం- బీసీ మహిళ
రాయదుర్గం- బీసీ మహిళ, తాడిపత్రి- జనరల్
పుట్టపర్తి- జనరల్, మడకశిర(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్
పామిడి(నగరపంచాయతీ)- బీసీ జనరల్, 
పెనుకొండ(నగరపంచాయతీ)- జనరల్

కర్నూలు: ఆదోని- బీసీ మహిళ, నందికొట్కూరు- జనరల్
నంద్యాల- జనరల్ మహిళ, ఎమ్మిగనూరు- బీసీ మహిళ
గూడూరు- ఎస్సీ జనరల్, ఆళ్లగడ్డ- జనరల్
ఆత్మకూరు(నగరపంచాయతీ)- జనరల్ మహిళ
డోన్(నగరపంచాయతీ)- బీసీ జనరల్

వైఎస్ఆర్‌ జిల్లా: బద్వేల్- జనరల్, మైదుకూరు- జనరల్
పొద్దుటూరు- బీసీ జనరల్, పులివెందుల- బీసీ జనరల్
రాయచోటి- జనరల్, జమ్మలమడుగు- బీసీ మహిళ
రాజంపేట- జనరల్, యర్రగుంట్ల- జనరల్
కమలాపురం(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ

మరిన్ని వార్తలు