నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!

27 Dec, 2019 05:34 IST|Sakshi

కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం

పేదలకిచ్చే ఇళ్ల స్థలాల టైటిల్‌పై విధివిధానాలు ఖరారు చేసే వీలు

దేవాలయాల ట్రస్టు బోర్డుల సభ్యుల నియామక చట్ట సవరణపై నిర్ణయం

కొత్తగా 104, 108 అంబులెన్స్‌ల కొనుగోళ్లకు ఆమోదం 

సాక్షి, అమరావతి:  పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను శుక్రవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది. చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో సభ్యుల నియామకానికి సంబంధించి దేవదాయ చట్టంలో సవరణలు తీసుకొచ్చే ముసాయిదా బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

పేదలకిచ్చే ఇళ్ల స్థలాల టైటిల్‌పై విధివిధానాలు ఖరారుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం వివరాలను కేబినెట్‌కు అధికారులు ఈ సందర్భంగా వివరించనున్నారు. కొత్తగా 104, 108 అంబులెన్స్‌లు 1,060 కొనుగోలు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. రాజధానితోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్‌కు సమరి్పంచే వీలుంది. ఎకనామిక్‌ జోన్లకు భూమి కేటాయింపులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  

మరిన్ని వార్తలు