తెరుచుకున్న మాల్స్, రెస్టారెంట్లు..

8 Jun, 2020 10:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన చోట్ల  సోమవారం నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నగరంలో మాల్స్‌,రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. కోవిడ్ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మాల్స్, రెస్టారెంట్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ తో పాటు శానిటైజేషన్‌ చేస్తున్నారు. హోటల్ లో పని చేసే సిబ్బంది ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్, గ్లౌజులు వేసుకోవాలని, టేబుల్‌కు టేబుల్‌కు మధ్య దూరం ఉండే విధంగా చూడటం వంటి నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. (నేటి నుంచి అన్నీ ఓపెన్‌)

విధులకు వచ్చే సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలని.. జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కాగా, ఏప్రిల్‌ 20 నుంచే ‘రీస్టార్ట్‌’ పేరుతో పరిశ్రమలు ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా షాపులకు.. ఇప్పుడు దేవాలయాలు, మాల్స్, హోటళ్లకు పచ్చజెండా ఊపడంతో పూర్తిస్థాయిలో వాణిజ్య లావాదేవీలు రాష్ట్రంలో మొదలయ్యాయి.
 

మరిన్ని వార్తలు