ఓటర్లకు యజమాని సెలవివ్వకపోతే జైలుశిక్ష: భన్వర్

28 Apr, 2014 17:10 IST|Sakshi
ఓటర్లకు యజమాని సెలవివ్వకపోతే జైలుశిక్ష: భన్వర్
హైదరాబాద్: ఏప్రిల్ 30 తేదిన జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ష్ట్రానిక్‌ మీడియాపై ఆంక్షలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి(30 తేది) సాయంత్రం 6.గంలవరకూ ఆంక్షలు విధించినట్టు ఆయన తెలిపారు. 
 
ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై పూర్తిగా నిషేధమని, ఈ 48 గంటలపాటు ఒపీనియన్‌ పోల్స్‌ ఇవ్వరాదని భన్వర్‌లాల్‌ హెచ్చరించారు.  పోలింగ్‌ రోజున పూర్తిగా సెలవు ప్రకటించామని భన్వర్‌లాల్‌ తెలిపారు.  
 
ప్రభుత్వ, ప్రైవేటు, దుకాణాలన్నింటికీ సెలవని, సెలవు ఇవ్వకుంటే కేసులు పెడతామని భన్వర్‌లాల్‌ హెచ్చరించారు. ఓటర్లకు సెలవు ఇవ్వకపోతే యజమానికి ఏడాది జైలుశిక్ష విధిస్తామని భన్వర్‌లాల్‌ తెలిపారు. 
 
మరిన్ని వార్తలు