‘ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు’

19 Dec, 2019 14:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమని రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఇఎఎస్‌ శర్మ తెలిపారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం అభినందనీయమన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పిన మా సలహాలు పట్టించుకోలేదన్నారు. రాజధాని పేరుతో అభివృద్ధి ఒకేచోట జరగకూడదని చెప్పారు. పాలన ప్రజల వరుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి ఫలాలు అందరి​కి అందాలని ఆకాంక్షించారు. మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణ జరగాలన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందనే భావన అన్ని ప్రాంతాల ప్రజలకు కలుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో మద్యపాన నిషేధం, ‘దిశ’ చట్టం వంటి  నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.


(చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా