రాజన్న ఆశయాలే జగన్ మేనిఫెస్టో : పెద్దిరెడ్డి

14 Apr, 2014 05:18 IST|Sakshi
రాజన్న ఆశయాలే జగన్ మేనిఫెస్టో : పెద్దిరెడ్డి

పుంగనూరు, న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలే పార్టీ మేనిఫెస్టోగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రూపొం దించారని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచా రం చేసిన అనంతరం ఆదివారం ఆయన పుంగనూరులో మాట్లాడుతూ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిన్న వయస్సులోనే ఎంతో పరిణితి చెందిన వ్యక్తి అని అభివర్ణించారు. రాష్ట్రంలో వైఎస్.రాజశేఖరరెడ్డి చేయాలనుకున్న పథకాలు ఆయన ఆకస్మిక మరణంతో నెరవేరలేదన్నారు.

వీటిని దృష్టిలో ఉంచుకుని ఆయన తనయుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి రాజన్న కలల ఎన్నికల మేనిఫెస్టోను రూపొం దించారన్నారు.  గ్రామాల్లో కార్యాల యాలు, వేలాది మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు రూ.20 వేలకోట్ల డ్వాక్రా రుణాల మాఫీ, రెండు జిల్లాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలు, 102, 103లో ఉద్యోగాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం టీచర్ల నియామకం, జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్లు, సీమాంధ్రలో గార్డెన్‌సిటీల ఏర్పా టు, తిరుపతి, విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, పటిష్టంగా జలయజ్ఞం అమలు ఇలా అన్ని వర్గాలకు మేలు జరిగేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మేనిఫెస్టోను రూపొందించారన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ర్టం అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు.  మే 7వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించి, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను బలియమైన శక్తిగా అవతరించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందిచాలని కోరారు.
 

మరిన్ని వార్తలు