ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్‌

29 Jun, 2020 18:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన మాజీ మంత్రి డొక్కా మణిక్య వరప్రసాద్‌ సోమవారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఇటీవల శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మాణిక్య వరప్రసాద్‌ ఒక్కరే నామిషన్‌ దాఖలు చేశారు. నేడు నామినేషన్‌ ఉప సంహరణ గడువు పూర్తికావడంతో ఆయన గెలిచినట్టు రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా ప్రకటించారు. దీంతో శాసనమండలిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక సభ్యుల సంఖ్య 10కి చేరింది. కాగా, శాసనసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో మాణిక్య వరప్రసాద్‌ ఎన్నిక లాంచనమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు