సమీక్ష లేదు... చెప్పింది వినడమే!

10 Jul, 2014 02:25 IST|Sakshi
  •  బీసీ సంక్షేమ మంత్రి రవీంద్ర తీరు
  • సాక్షి ప్రతినిధి, విజయవాడ :  విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో బుధవారం హడావుడి నెలకొంది. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు. సమీక్ష సుమారు ఒంటిగంటకు మొదలైంది. రెండు మాటలు మాట్లాడిన తరువాత మంత్రి ఉమా కలెక్టర్‌తో తన చాంబర్‌లో సీఎం పర్యటన షెడ్యూలు రూపొందించేం పనిలో నిమగ్నమయ్యారు.

    సమీక్షలో మంత్రి ఏమి అడుగుతారనే భయంతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు,  సీనియర్ వార్డెన్‌లను వెంటబెట్టుకొని పక్కా సమాచారంతో వచ్చారు. మంత్రి ఒక్కో జిల్లా నుంచి అధికారిని మాట్లాడాల్సిందిగా కోరారు. జిల్లాలోని హాస్టళ్లలో పిల్లలు ఎంత మంది ఉన్నారు.. సీట్ల ఖాళీలు.. మెనూ తదితర వివరాలను అధికారులు చెప్పారు. సీట్ల భర్తీ, హాజరు శాతం పెంచడం వంటి అంశాలపై చర్చించలేదు. కేవలం అధికారులు చెప్పే అంకెలు, వారు వివరించిన అంశాలు వినటానికే మంత్రి సమయం కేటాయించారు. ఇందుకోసం ఇక్కడదాకా తమకు ఎందుకు పిలవడం.. అని పలువురు అధికారులు వ్యాఖ్యానించారు.
     
    నేడు హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు సమావేశం

    సమీక్ష సమావేశం అనంతరం దేవినేని ఉమ విలేకరులతో మాట్లాడుతూ నాగార్జున సాగర్ నుంచి తాగునీరు, సాగునీరు ఎలా పొందాలనే విషయంపై గురువారం హైదరాబాద్‌లో కృష్ణాబోర్డు సమావేశం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు