ఇంగ్లీష్‌ పరిజ్ఞానంపై టోఫెల్‌ తరహాలో పరీక్ష

21 Jul, 2020 19:00 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ‘కిండర్‌ గార్డెన్‌పై ప్రత్యేక దృష్టి సాధించాలి. పాఠశాల విద్య పరిధిలోకి పీపీ–1, పీపీ–2లను తేవాలి. స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీచర్ల కోసం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లీష్‌ పరిజ్ఞానంపై టోఫెల్‌ తరహాలో పరీక్ష నిర్వహించాలి. లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌కు హైస్కూల్లోనే నాంది పడాలి. డిజిటల్‌ విద్య, డివైజ్‌లపై అవగాహనకు తరగతులు ఉండాలి. హైస్కూల్లో లైఫ్‌ స్కిల్స్, కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, స్కూళ్లలో బాత్‌రూమ్‌ల శుభ్రతకు ప్రాధాన్యంత కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని సంపూర్ణంగా వినియోగించుకునేందుకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. (‘సత్వర న్యాయం కోసమే దిశ చట్టం’)

మరిన్ని వార్తలు