ఏపీలో సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక పథకాలు

26 Dec, 2019 05:21 IST|Sakshi

అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్‌ వి.ఈశ్వరయ్య

ఏపీ మంత్రివర్గంలో బీసీలకు 60% ప్రాతినిధ్యం, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు

విద్య, ఆరోగ్యం.. ఇలా అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు

అన్ని రాష్ట్రాలూ ఏపీ తరహా కార్యక్రమాలు అమలు చేయాలి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని, మిగతా అన్ని రాష్ట్రాలూ వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో ‘పూలే, అంబేడ్కరీ గౌరవ్‌శాలీ ఔర్‌ ఆదర్శ్‌వాదీ ముహిమ్‌(పగామ్‌)’ సంస్థ, అఖిల భారత బీసీ సమాఖ్య (ఏఐబీసీఎఫ్‌), వివిధ రాష్ట్రాల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు కలిసి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు 200 ఏళ్లు బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్న వివక్ష, స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అందకపోవడంపై జస్టిస్‌ ఈశ్వరయ్య విశ్లేషించారు.

రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కాంగ్రెస్‌ హయాంలోగానీ, బీజేపీ హయాంలో గానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ‘సామాజిక న్యాయం అందాలంటే విద్య ఒక్కటే మార్గమని పూలే, అంబేడ్కర్‌ ఏనాడో చెప్పారు. సామాజిక న్యాయం అందాలంటే దేశ సంపద సమానంగా పంపిణీ కావాలి. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే బీసీలు చట్టసభల్లోకి రావాలి. కేంద్ర సచివాలయంలో ఓబీసీ వర్గానికి చెందిన ఒక్క కార్యదర్శి కూడా లేరు. కేంద్ర కేబినెట్‌లో ఒక్క ఓబీసీ కూడా మంత్రిగా లేరు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉండాలంటే 15 శాతం కూడా అమలు కాలేదు. క్రీమీలేయర్‌ అని పెట్టి అన్యాయం చేస్తున్నారు’ అని జస్టిస్‌ ఈశ్వరయ్య పేర్కొన్నారు.

బీసీలు రాజ్యమేలిన చోటా అందనన్ని ఫలాలు ఏపీలో అందుతున్నాయి..
 బీసీలు రాజ్యాధికారం చేపట్టిన రాష్ట్రాల్లోనూ సమన్యాయం జరగడం లేదని జస్టిస్‌ ఈశ్వరయ్య అన్నారు. యూపీలో మాయావతి రాజ్యమేలినా బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ములాయం సింగ్, అఖిలేష్‌ యాదవ్‌ అధికారం చేపట్టినప్పుడు కొన్ని బీసీ కులాలకే న్యాయం జరిగిందన్నారు. బీసీలు రాజ్యమేలిన రాష్ట్రాల్లోనూ అందని ఫలాలను ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మంత్రివర్గంలో బీసీలకు 60 శాతం, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు పీజీ వరకూ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ‘నాణ్యమైన విద్యను మాకందించండి.. ఎటువంటి రిజర్వేషన్లూ అవసరం లేదు’ అని పూలే, అంబేడ్కర్‌ అన్నారని, అటువంటి విద్య అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి నవరత్నాల పేరిట సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులకు రూ.15 వేలు అందిస్తున్నారని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని వివరించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పీజీ విద్యార్థులకు వసతి కోసం ఆర్థిక సాయం.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా పనిచేస్తోందని, విద్య, ఆరోగ్యం, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తరహా కార్యక్రమాలు అమలుచేయాలంటూ డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు..
ఏపీ సీఎం నవరత్నాల పేరిట సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని జస్టిస్‌  ఈశ్వరయ్య తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులకు రూ.15 వేలు అందిస్తున్నారని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని వివరించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పీజీ విద్యార్థులకు వసతి కోసం ఆర్థిక సాయం.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా పనిచేస్తోందని, విద్య, ఆరోగ్యం, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తరహా కార్యక్రమాలు అమలుచేయాలంటూ డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు