బియ్యం ధరలకు రెక్కలు

29 May, 2018 12:53 IST|Sakshi
మిల్లర్ల దగ్గర ఎగుమతులకు సిద్ధం చేస్తున్న బియ్యం

నెలనెలా పైపైకి పోతున్న ధరలు

బెంబేలెత్తుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు

కారంచేడు:  బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటున్న తరుణంలో బియ్యం ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నాయి. మార్కెట్లో బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతుంటే ఉద్యోగులు పెరుగుతున్న ధరలను చూచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నెల నెలా బియ్యం ధరలు పెరుగుతుంటే ఎలా కొనుక్కోవాలని ప్రశ్నిస్తున్నారు.

రెండేళ్ల క్రితం వరిసాగు లేకపోవడమే..
జిల్లా ధాన్యగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలో రెండేళ్ల క్రితం ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. సాగుకు అసవరమైన నీరు లేకపోవడంతో వరి సాగు 80 శాతానికి పైగా నిలిచిపోయింది. దీంతో ధాన్యం లోటు వచ్చింది. రైతుల ఇళ్లల్లో పురులు ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో వారంతా తిండి గింజలకు కూడా వారు వెతుక్కునే పరస్థితి వచ్చింది. తరువాత ఏడాది మాగాణి సాగు బాగానే ఉంది. అయినా రెండు సంవత్సరాల ప్రభావంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. బియ్యం మిల్లర్లు, వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం 2 వేల ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 25 వేల ఎకరాల్లో వరి సాగుంది. రెండేళ్ల క్రితం 60 వేల క్వింటాళ్ల దిగుబడి రాగా ఈ ఏడాది 8,75,000 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

ధాన్యం ధరలపై స్పస్టత లేదు..
జిల్లాలోనే అత్య«ధికంగా వరి సాగు చేసే ప్రాంతంగా కా>రంచేడు మండలం ప్రసిద్ధి,. ఈ ఏడాది కొమ్మమూరు కాలువ పరి«ధిలో సుమారు లక్ష ఎకరాల్లో అ«ధికారిక, అనధికారిక లెక్కల ప్రకారం వరి సాగైంది. దీంతో ఎకరానికి 35 బస్తాల చొప్పున 35 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడులున్నాయి. ధాన్యం ధరల్లో మాత్రం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది.  ధాన్యానికి ప్రస్తుతం దళారులు బస్తా (75 కేజీలు) ’ రూ.1700–1750 వరకు కొనుగోలు చేస్తున్నారు. రూ.2000 ధర ఇస్తే రైతులకు ఊరటగా ఉంటుందని వారు వాపోతున్నారు.

బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి: ప్రస్తుతం బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ ధరలు లేవు. గత ఏడాది 25 కేజీల బియ్యం బస్తా రూ.1100  ఉంటే ఈ ఏడాది బియ్యం బస్తా రూ.1250లకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిరుద్యోగులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.- పి. శ్రీనివాసరావు, కారంచేడు

బియ్యం ధరలు అదుపు చేయాలి: వై బియ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం గానీ అ««ధికారులు గానీ వీటిని అదుపు చేయాల్సి ఉంది. కేజీ రూ.50 వరకు ఉంది.  ఒక కుటుంబంలో రోజుకు రెండు కేజీల చొప్పున బియ్యం ఖర్చుకే రూ. 100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సగటున నెలకు బియ్యానికే రూ.2,500 వరకు ఖర్చవుతోంది.  -సుబ్బారావు, కారంచేడు

మరిన్ని వార్తలు