పురచేత్తో పెంపు.. కుడిచేత్తో కోత..

1 Mar, 2014 03:58 IST|Sakshi
పురచేత్తో పెంపు.. కుడిచేత్తో కోత..

 కుడిచేతితో చేసిన దానం ఎడమచేతికి తెలియనివ్వరాదు’ అన్నది పెద్దల సూక్తి. ‘పురచేత్తో పెంచిన రుణసాయానికి కుడిచేతితో కోత పెట్టాలి’..

 

ఇదీ ఇప్పటి సర్కారు యుక్తి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘ఇందిరమ్మ’ పథకం లబ్ధిదారులకు ఇప్పుడు ఎదురవుతున్న ఆశాభంగమిది. ఇందిరమ్మ లబ్ధిదారులకిచ్చే రుణం పెంచామని గొప్పలు చెప్పుకొన్న కిరణ్ సర్కారు.. గుట్టుచప్పుడు కాకుండా ఆ మొత్తంలో రకరకాలుగా కోత పెట్టింది.
 

 

మండపేట,

 తెలుగుదేశం హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి రూరల్‌లో రూ.30,000, అర్బన్‌లో రూ.40,000లుగా ఉన్న రుణాన్ని వైఎస్ ‘ఇందిరమ్మ’ పథకం ప్రవేశపెట్టి రూ.45,000, రూ.55,000లకు పెంచారు. పరిపాలన ఖర్చులు, లబ్ధిదారుల వాటా కింద అర్బన్‌లో రూ.3,300, రూరల్‌లో రూ.1,300 తగ్గించి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేవారు.

 

కిరణ్ సర్కారు కూడా ఏడాది క్రితం వరకు ఇలాగే ఇస్తూ వచ్చింది. పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలకు అనుగుణంగా రుణమొత్తం పెంచాలన్న డిమాండ్‌తో కొద్ది నెలల క్రితం అర్బన్‌లో ఓసీ, బీసీలకు రూ.80, 000లకు, ఎస్సీలకు రూ.1,00,000లకు, రూరల్‌లో ఓసీ, బీసీలకు రూ.70,000లకు, ఎస్సీలకు రూ.1,00,000లకు పెంచారు. రుణసాయం పెరిగిందన్న భరోసాతో ఇళ్ల నిర్మాణానికి నడుం బిగించి లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది.

 

పరిపాలన ఖర్చులు, లబ్ధిదారుల వాటా అంటూ ఓసీ, బీసీలకు అర్బన్ ప్రాంతాల్లో రూ.7,500, ఎస్సీలకు రూ.8,100, రూరల్‌లో అన్ని వర్గాల వారికీ  రూ.4,200 చొప్పున కోత విధిస్తున్నారు. అంతేకాక ప్లాస్టింగ్ తర్వాత ఇస్తామంటూ మరో రూ.5,000 తగ్గించేస్తున్నారు. అంటే ఓసీ, బీసీలకు అర్బన్‌లో రూ.67,500, రూరల్‌లో రూ.60,800, ఎస్సీలకు అర్బన్‌లో రూ.86,900, రూరల్‌లో రూ.90,800 మాత్రమే అందుతున్నాయి. రుణసాయాన్ని పెంచినట్టే పెంచి ప్రభుత్వం కోత విధిస్తోందని, ప్లాస్టింగ్ తర్వాత ఇస్తామంటున్న రూ.5 వేలు అసలే అందడం లేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఈ పథకం కింద మూడు విడతల్లో జిల్లాకు సుమారు 2,46,560 ఇళ్లు మంజూరవగా ఇప్పటి వరకు కేవలం 92,743 పూర్తయ్యాయి. 24,936 ఇళ్ల నిర్మాణ ం ఇంకా ప్రారంభమే కాలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

 

 శ్లాబ్ దశలో కేవలం రూ.3,300లే..

 

 బిల్లుల విడుదలలోనూ ప్రభుత్వం తీరు విమర్శలకు తావిస్తోంది. వైఎస్ హయాంలో ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా పెంచిన సాయం పూర్తిగా లబ్ధిదారునికి చేరేది. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం పునాది, లింటల్ దశలకు మాత్రమే పెంచిన సాయాన్ని విడుదల చేస్తున్నారు. శ్లాబ్‌కు మాత్రం గతంలో మాదిరిగానే రూ.10,800 ఇస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో మొదటి రెండు దశలు పూర్తిచేసుకుని శ్లాబ్ దశలో ఉంటే పెంచిన సాయం వారికి అందని దుస్థితి నెలకొంటోంది. అర్బన్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. శ్లాబ్ దశలో ఉన్న లబ్ధిదారులకు పెంచిన సాయం అందకపోగా శ్లాబ్ పూర్తయ్యాక చెల్లించే బిల్లులో పరిపాలన ఖర్చుల కింద రూ.7,500 కోత విధిస్తుండటంతో ఆ దశలో వచ్చే రూ. 10,800లకుగాను కేవలం రూ.3,300లు మాత్రమే అందుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 సాయాన్ని పెంచి,
 సకాలంలో ఇవ్వాలి..

 

 గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ప్రభుత్వ సాయం చాలక ఇందిరమ్మ లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుతం టన్ను ఐరన్ రూ.44,000, సిమెంట్ కంపెనీలను బట్టి బస్తా రూ.250 నుంచి రూ.270, కంకర రెండు యూనిట్ల లారీ రూ.72,00, రెండు యూనిట్ల
 

మరిన్ని వార్తలు