హక్కుల సాధనకు పోరాడుదాం

6 Jun, 2016 04:28 IST|Sakshi
హక్కుల సాధనకు పోరాడుదాం

దూదేకుల యువగర్జన విజయవంతం
 
కల్లూరు: దూదేకుల హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడుదామని అనంతపురం జెడ్పీ చైర్మన్ చెమన్ అన్నారు. ఆదివారం దూదేకుల ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు డీపీ మస్తాన్ అధ్యక్షతన నగరంలోని రావూరి గార్డెన్‌లో రాష్ట్ర దూదేకుల యువగర్జన నిర్వహించారు.  ఈ సందర్భంగా చెమన్ మాట్లాడుతూ దూదేకుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ  బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో తమ సామాజిక వర్గంలో చదువుకున్న మేధావులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారన్నారు.

అలాంటి వారిని గుర్తించి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని పార్టీలను డిమాండ్ చేశారు. దూదేకులను బీసీ బి గ్రూపు నుంచి తొలగించి బీసీ ఈ గ్రూపులో చేర్చి విద్యా, ఉద్యోగ రిజర్వేషన్‌లు కల్పించాలని కోరారు.  దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్‌మీరా మాట్లాడుతూ తమను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నారన్నారు.

హజ్‌కమిటీ, వక్ఫ్‌బోర్డు, మైనార్టీ కార్పొరేషన్‌లలో దూదేకులకు చైర్మన్ పదవులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో దూదేకుల సంఘం యూత్ అధ్యక్షుడు పి. మస్తాన్,   జిల్లా అధ్యక్షుడు నాయిబాబు, నూర్‌బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి దూదేకుల సలేం, సత్తార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు