ఎదురు దెబ్బలు

14 Jan, 2015 00:06 IST|Sakshi
ఎదురు దెబ్బలు

పెరిగిపోయిన మావోయిస్టుల లొంగుబాట్లు
240 మంది మిలీషియా సభ్యుల సరెండర్
2005-2015 మధ్య పది
ఎన్‌కౌంటర్లు: 30 మంది మృతి
ఉద్యమంపై తీవ్ర ప్రభావం

 
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు తమదే పైచేయిగా వ్యవహరించిన దళసభ్యులు పోలీసుల దాడుల్లో ఒక్కరొక్కరుగా మరణిస్తుండగా..ఈస్టు డివిజన్‌లో మావోయిస్టులకు వెన్నుదన్నుగా ఉండే మిలీషియా సభ్యులు ఐదేళ్లలో 240 మంది లొంగిపోయారు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పెద్ద నేతలు పోలీసులకు చిక్కడం, లేదా లొంగిపోవడం కూడా ఉద్యమంపై తీవ్రప్రభావం చూపుతోంది.
 
కొయ్యూరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావో యిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఐదేళ్లుగా దళసభ్యులతోపాటు మిలీషియా సభ్యు లు లొంగిపోతున్నారు.  గాలికొండ దళ సభ్యుడు పంగి భాస్కరరావు అలియాస్ సూర్యాన్ని(22) జిల్లా పోలీ సులు మంగళవారం అరెస్ట్ చేశారు. గాలికొండ దళం ఆర్మడ్  అండ్ హార్డ్‌కోర్ మిలీ షియా సభ్యులు  పదకొండు మంది ఎస్పీ కోయ ప్రవీణ్ ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న కలిమెల దళం సభ్యురాలు కొర్ర శాంతి అలియాస్ రత్నం(22)కూడా పోలీసులకు లొంగిపోయింది. ఏవోబీలో కీలక నేతగా ఉన్న చడ్డా భూషణం అలియాస్ నాగరాజు శిమిలిగుడ వద్ద ఏడాది క్రితం దొరికిపోయి జైలులో ఉన్నారు. ఏవోబీలో ‘ఆపరేషన్ ఆల్ అవుట్’ పేరిట ఇరువైపుల నుంచి ఏపీ, ఒడిశా బలగాల కూంబింగ్‌తో ఫలితాలు వస్తున్నాయి. 2005 నుంచి 2015  మధ్య  జరిగిన ఎన్‌కౌంటర్లలో సుమారు 30 మంది దళసభ్యులు మరణించారు. 2007లో జీకేవీధి మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వక్కాపూడి చంద్రమౌళి అలియాస్ దేవన్న,అతని భార్య మరణించారు  ఈస్టు డివిజన్‌లో చోటుచేసుకుంటున్న ఎన్‌కౌంటర్లలో ఎక్కువ మంది మావోయిస్టులే మరణిస్తున్నారు. గునుకురాయి వద్ద 2006,2008 లలోజరిగిన జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు.

2007లో కొయ్యూరు మండలం కన్నవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు చనిపోయారు. అనంతరం అమ్మిడేలు సంఘటనలో ఇద్దరు మరణించారు. అప్పట్లో మావోయిస్టు నేత బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ తప్పించుకున్నట్టుగా పోలీసులు భావించారు.
 అనంతరం 2009లో గొల్లువలస ఎన్‌కౌంటర్లో ఇద్దరు మరణించారు. 2010లో చెరువూరు సంఘటనలో నలుగురు మరణించారు. ఇందులో గుంటూరు జిల్లా పత్తికొండ ప్రాంతానికి చెందిన యువతి కూడా మరణించింది. 2013 జూలైలో కొయ్యూరు మండలం కిండంగి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో  మల్కన్‌గిరి జిల్లాలో కలిమెల దళానికి చెందిన సహాయ కమాండర్ రంబోత అలియాస్ లక్ష్మి చనిపోయారు. 2014లో వీరవరం ఘటనలో గిరిజనుల చేతిలోనే గాలికొండ ఏరియా కమిటీకి చెందిన శరత్‌తో పాటు మరో మిలీషియా సభ్యులు మరణించారు. దశాబ్ద కాలంలో మావోయిస్టులు  30 మంది వరకు చనిపోయారు. 2005లో పుట్టకోట వద్ద జరిగిన  ఎన్‌కౌంటర్లో  మావోయిస్టు కీలక నేత కైలాసం మరణించారు. ఇప్పుడు ఈస్టు డివిజన్ కార్యదర్శికి అతని పేరు పెట్టారు.
 
 

మరిన్ని వార్తలు