మాట తప్పని నాయకుడు జగనన్న

16 Jul, 2018 08:19 IST|Sakshi

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు తాగునీటి సమస్యపై టీసీ     అగ్రహారం ప్రజల వినతి

ఇచ్చిన హామీ మేరకు     రూ.2.5 లక్షలతో వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు

ప్రారంభించిన ఎమ్మెల్యే     ఆర్‌కే రోజా

వడమాలపేట : మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగనన్న అని.. అందులో భాగంగా టీసీ అగ్రహారం వాసులకు ఇచ్చిన హామీ మేరకు వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయించారని నగరి ఎమ్మె ల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో వడమాలపేట మండలం టీసీ అగ్రహారం మీదుగా సాగింది. అప్పుడు తమ గ్రామానికి విచ్చేసిన జననేతకు టీసీ అగ్రహారం ప్రజలు తాము తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని విన్నవించారు. అందులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు దాదాపు రూ.2.5 లక్షలతో ఆర్‌ఓ వాటర్‌ ప్లాంటును గ్రామంలో ఏర్పాటు చేయించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఆ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారం కోçసం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఆ మహానేత వైఎస్‌ పాలనను మళ్లీ తెచ్చుకోగలమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సురేష్‌కుమార్, సర్పంచ్‌ శశికళ, మండల కన్వీనర్‌ సదాశివయ్య, నగరి నియోజకవర్గ బూత్‌ కమిటీల కన్వీనర్‌ చంద్రారెడ్డి, వడమాలపేట మండల బూత్‌ కన్వీనర్ల మేనేజర్‌ తులసీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు