రక్తమోడిన రహదారి

23 Nov, 2015 01:18 IST|Sakshi
రక్తమోడిన రహదారి

బస్సు,లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి
జానపాడు వద్ద దుర్ఘటన
మృత్యుల్లో నాయనమ్మ, మనుమరాలు
మృతులంతా ఆర్టీసీ బస్సు  ప్రయాణికులే
పెళ్లి లారీలో ఉన్న వారికి గాయాలు

 
పిడుగురాళ్ళరూరల్ /పిడుగురాళ్ళ : పెళ్లి సందడితో ఆనందంగా గడిపి లారీలో బంధువులంతా సొంత ఊరికి బయలుదేరారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు తమ గమ్య స్థానం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. ఆర్టీసీ బస్సు కారంపూడి నుంచి 60 వుంది ప్రయూణికులతో వుధ్యాహ్నం బయులుదేరింది. రాజుపాలెం వుండలం దేవరంపాడు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో వివాహానికి వెళ్లి బంధువులతో బొల్లాపల్లి వుండలం స్వగ్రావుమైన గువ్మునంపాడుకు తిరిగివెళ్తుండగా వూర్గం వుధ్యలో ఈ ఘటన జరిగింది. లారీలో ప్రయూణిస్తున్న సువూరు 40 వుంది, ఆర్టీసీ బస్సులో ప్రయూణిస్తున్న వురో 40 వుంది మొత్తం 80 వుందికి గాయూలు అయ్యూరుు. నలుగురు పరిస్థితి విషవుంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు.

క్షతగాత్రులను బస్సుల్లో తరలింపు..
ప్రమాదం ఘటన సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీఎం   కేశవరావు ఘటనా స్థలం వద్దకు రెండు ఆర్టీసీ బస్సులను పంపారు. క్షతగాత్రులు ఎక్కువగా ఉండడం, అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో బస్సుల్లో వారిని పిడుగురాళ్ల పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. పట్టణంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తీసుకొని రాగా అక్కడ వైద్యులు లేకపోవటంతో సువూరు అరగంటపాటు క్షతగాత్రులను రోడ్డుపైనే ఆర్టీసీ బస్సులో ఉంచారు. అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయూలైన వారికి ప్రథవు చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేటు అంబులెన్స్‌లలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.  
 
బంధువుల రోదనలు..
క్షతగాత్రులు ఎక్కువగా ఉండటంతో సవూచారం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రుల వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. పిడుగురాళ్ల పట్టణంలో ఐదు వైద్యశాలలో బాధితులను చేర్చటంతో వారు బంధువులు వారికి సంబంధించిన వారు ఏ హాస్పటల్‌లో ఉన్నారో అని అన్ని హాస్పటళ్లకు తిరిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రవూద ఘటన తెలుసుకున్న తహశీల్దార్ ఎస్.లక్ష్మయ్యు, సీఐలు సుబ్బారావు, శ్రీధర్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం కేశవరావులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. వుృతదేహాలను గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
 
జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ..
గుంటూరు రూరల్ : జిల్లాలోని పిడుగురాళ్ళ సమీపంలోని జానపాడు గ్రామం వద్ద బస్సు లారీ డీకొన్న ఘట నలో తీవ్రగాయాల పాలైన వారిని గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. వారిలో దారివేముల ఏసమ్మ(45) చికిత్స పొందుతూ మృతిచెందింది. గాయాలపాలైన చల్లా నాగలక్ష్మి, ఆశీర్వాదం, ఆకుల నాగేంద్రం, అరుణ, నిమ్మల సీతమ్మ, డేరంగుల సునందరావులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు