హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం

25 Jan, 2014 04:02 IST|Sakshi

హైదరాబాద్, న్యూస్‌లైన్: వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టడంతో ఓ ఎం.ఫార్మసీ  విద్యార్థి మృతి చెందగా మరో నలుగురు విద్యార్థులు గాయాలపాలైన సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... చిత్తూరు జిల్లాకు చెందిన అర్తల రామ్మూర్తి (28) నగరంలోని కేర్ ఆస్పత్రిలో పనిచేస్తూ, బాటసింగారంలోని ఎస్‌ఎల్‌సీ కళాశాలలో ఎం.ఫార్మసీ చదువుతున్నాడు. శుక్రవారం మొదటి సంవత్సరం పరీక్షకు హాజరై తోటి విద్యార్థులు కోదండ రాముడు, తిమోదిన్‌లతో కలిసి పల్సర్ బైక్(ఏపీ09సీఎల్ 8070)పై నగరం వైపు వస్తున్నాడు.

 ముషీరాబాద్‌లో నివాసి బాబు కుమారుడు ఇంటర్ విద్యార్థి నరేష్, రాంనగర్‌లోని ప్రై వేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సుప్రియలు బైక్(ఏపీ03ఏజెడ్ 4916)పై వస్తూ అబ్ధుల్లాపూర్ గండిమైసమ్మ వద్ద మలుపు తిరుగుతున్నారు. నగరం నుంచి వేగంగా వస్తున్న ఇన్నోవా కారు (ఏపీ37బీపీ 0001) అదుపుతప్పి డివైడర్‌కు అవతలి వైపు దూసుకెళ్లి రెండు బైకులను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న రామ్మూర్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో బైక్‌పై ఉన్న నరేష్, సుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు.

 రామ్మూర్తి బైక్‌పై ఉన్న తిమోదిన్, కోదండ రాముడుకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆదిత్య ఫిషరీస్ ప్రై వేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీకి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు’

నైజీరియన్ల అక్రమ దందాకు తెర

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం జగన్‌ను కలుసుకున్న ఆస్ట్రేలియా బృందం

ఐఐటీల్లో రెండేళ్లలో 2461 డ్రాపవుట్లు

‘భూమిపై అన్నిరకాల హక్కులు రైతులకే’

ఇదొక విప్లవాత్మక కార్యాచరణ: సీఎం జగన్‌

చంద్రబాబు కంటే కేసీఆర్‌ వెయ్యిరెట్లు మంచివారు..

జైలు శిక్ష అభ్యంతరకరం: ఎంపీ మిథున్‌రెడ్డి

తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలి

బాలికపై లైంగికదాడి

‘గంటా’.. ‘గణ’గణమనలేదు! 

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

రేషన్‌ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదు

‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’

జసిత్‌ క్షేమం; తండ్రిపై ఆరోపణలు..!

ఎంతటి సర్పమైనా ఇట్టే పట్టేస్తాడు..

అందుకే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు

గోదావరి జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ

లోకేశ్‌ సీఎం కాకూడదని..

జసిత్‌ క్షేమం; ఎస్పీకి ఫోన్‌ చేసిన సీఎం జగన్‌

ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిన ఆనం

వైద్య సేవకు ‘కమీషన్‌’

జసిత్‌ను చూసిన ఆ క్షణం.. తల్లి ఉద్వేగం..!

‘మందకృష్ణకు ఆ అర్హత లేదు’

దర్గాలో సమాధి కదులుతోంది..!

అనగనగా ఒక దత్తాపురం

జసిత్‌ కిడ్నాప్‌.. ఈ ప్రశ్నలకు సమాధానమేది?

టీవీ5పై చర్యలు తీసుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’