దారి చూడు.. దుమ్ము చూడు..!

3 Dec, 2018 12:04 IST|Sakshi
వేగవరం సమీపంలో జాతీయ రహదారిపై దుమ్ము లేస్తున్న దృశ్యం

నాసిరకంగా మరమ్మతులు

దుమ్ము, దూళితో ఇబ్బందులు

పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం రూరల్‌: జిల్లాలో ప్రధాన రహదారుల్లో ఒకటైన దేవరపల్లి– తల్లాడ జాతీయ రహదారిపై ప్రయాణం వాహనదారుల పాలిట నరకప్రాయంగా  మారుతోంది. జీలుగుమిల్లి నుంచి జంగారెడ్డిగూడెం వరకు ధ్వసమైన రహదారిని మరమ్మతులు చేస్తున్నారు. అయితే మరమ్మతుల్లో భాగంగా రహదారిలో పలు ప్రాంతాల్లో లేయర్లను తొలగించారు. పలు ప్రాంతాల్లో రహదారిని పూర్తి చేయకపోవడంతో వాహనాల రాకపోకల సమయంలో లేస్తున్న దుమ్ము వల్ల వాహనదారులు  అవస్థలు పడుతున్నారు.

దుమ్ము లేస్తున్న సమయంలో వాహనాలు గుర్తించక ఎక్కడ ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనన్న భయంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. జంగారెడ్డిగూడెం సబ్‌స్టేషన్‌ వద్ద, వేగవరం బీసీ కాలనీ, జొన్నవారిగూడెం సమీపంలో రహదారిపై లేయర్‌ తొలగించి వదిలేశారు. దుమ్ము లేస్తున్న ఈ ప్రాంతాల్లో సంబంధిత శాఖాధికారులు కనీసం వాటర్‌ సర్వీసింగ్‌ పనులు కూడా చేయడం లేదు. దుమ్ము రేగడం వల్ల అనా రోగ్యాలకు గురికావడంతో పాటు ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తాయోన్న భయంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటిౖMðనా అధికారులు స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తయ్యేలోపు దుమ్ము రేగకుం డా వాటర్‌  సర్వీసింగ్‌ పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు