రూ. 6500కోట్లతో ఎన్డీబీ ప్రాజెక్ట్‌ పనులు: మంత్రి ధర్మాన

20 Sep, 2019 16:04 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : జిల్లా, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు, భవనాల మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. రాష్ట్రంలో 400 వందల వంతెనల నిర్మాణానికి టెండర్లను పిలిచామని, అవినీతి రహితంగా టెండర్లతో రోడ్లు నిర్మిస్తామని అన్నారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.329కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రూ. 6500కోట్లతో ఎన్డీబీ ప్రాజెక్ట్‌ పనులు కొనసాగుతాయని, రూ. 10 కోట్లు దిగువ ఉన్న పనులకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు. సీలేరు, భద్రాచలం, అరకు, రాజమండ్రిలో నిర్మాణంలో ఉన్న రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు