సత్యవేడులో రెండిళ్లలో చోరీ

7 Sep, 2015 09:29 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణం కాపువీధిలో దొంగలు తెగబడ్డారు. వివరాలు..కాపువీధికి చెందిన వచ్చల అనే మహిళ వారం రోజుల క్రితం బెంగుళూరులో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లింది. దొంగలు సదరు మహిళ ఇంటి కిటీకీలు తొలగించి బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు.

సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా పగలగొట్టి ఉండటంతో దొంగలు పడ్డారన్న విషయం అర్ధమైంది. ఆదివారం రాత్రి అదే వీధిలో ఉంటున్న ప్రసాద్ అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తుండగా, ఇంట్లో చొరబడిన దొంగలు రూ.4 వేల నగదు, ఓ సెల్‌ఫోన్ అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు