రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ‘తొలిప్రేమ’

3 Feb, 2018 11:16 IST|Sakshi

హీరో వరుణ్‌తేజ్‌   

తొలిప్రేమ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

చేబ్రోలు/పాత గుంటూరు :  నేటి యువత అభిరుచులకు అనుగుణంగా రూపొందిన రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ‘తొలి ప్రేమ’ చిత్రమని ఫిదా ఫేమ్‌ హీరో వరుణ్‌తేజ్‌ అన్నారు. శుక్రవారం విజ్ఞాన్‌ యూనివర్సిటీలో తొలి ప్రేమ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో హీరో వరణ్‌తేజ్, హీరోయిన్‌ రాశిఖన్నా, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, దర్శకుడు అట్లూరి వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిప్రేమ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావురత్తయ్య నివాసంలో లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి హీరో, హీరోయిన్‌ వరుణ్‌తేజ్, రాశిఖన్నా విలేకరులతో మాట్లాడారు.

తొలిప్రేమ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్నారు. చిత్ర కథాంశం పూర్తిగా ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. హీరోయిన్‌ రాశిఖన్నా మాట్లాడుతూ తొలిప్రేమ చిత్రాన్ని విజయవంతం చేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రెండో ఈవెంట్‌ భీమవరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ తొలి ప్రేమ చిత్రం ప్రమోషన్‌కు హీరో హీరోయిన్‌ వరుణ్‌తేజ్, రాశిఖన్నా రావడంతో అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు