విశాఖలో రూఫ్‌టాప్ సోలార్ ఎక్స్‌పో 2015

9 Aug, 2015 09:04 IST|Sakshi

ఈ నెల 22 నుంచి 3 రోజులపాటు నిర్వహించనున్న ఏపీఈపీడీసీఎల్
సాక్షి, విశాఖపట్నం: సౌర విద్యుత్‌పై ప్రజల్లో అవగాహనను పెంచి, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) విశాఖలో ఈ నెల 22,23,24 తేదీల్లో 'రూఫ్‌టాప్ సోలార్ ఎక్స్‌పో'నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో విశాఖ బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ ఎక్స్‌పోలో సోలార్ విద్యుత్ వినియోగం,లాభాలు, ఉత్పత్తి, అమ్మకం వంటి అంశాలపై పలు ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి  సోలార్ విద్యుత్ రంగంలో నిష్ణాతులైన పంపిణీదారులు, ఉత్పత్తిదారులు, సాంప్రదాయేతర ఇంధన వనరుల విభాగానికి చెందిన నిపుణులు ఈ మూడు రోజుల ఎక్స్‌పోలో పాల్గొంటారు. సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చే బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల వారు ప్రజలకు సలహాలు, సూచనలు అందిస్తారు.  దేశంలో తొలిసారిగా భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ సోలార్ ఎక్స్‌పో సందర్భంగా చిన్నారులకు, యువతకు సోలార్ ఎనర్జీపై వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పోటీలు జరుగుతాయి.


17లోగా రిజర్వ్ చేసుకోవాలి: సోలార్ ప్రదర్శనలో పాల్గొనదలిచిన ఉత్పత్తి, విక్రయదారులు ఈ నెల 17వ తేదీలోపు నిర్ణీత రుసుము చెల్లించి రిజర్వ్ చేసుకోవాలని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్(కమర్షియల్, ఆర్‌ఎ,పిపి) బి.రమేష్‌ప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9490608195, 9440812384 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు