-

ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండగ

24 Oct, 2015 09:19 IST|Sakshi

నెల్లూరు నగరంలోని ప్రఖ్యాత బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం నిండిపోయింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండగకు సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. మొహరం నెలలో మెదటి రోజు అయిన షహదత్ తో ఏటా ఈ రొట్టెల పండగ మొదలైతుంది. మొదటి రోజుతోపాటు మూడో రోజు జియారత్ కీలక దినాలుగా భక్తులు భావిస్తారు.
గతంలో అయితే, షహదత్ నాడు మాత్రమే రొట్టెల పండగ జరిగేది. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో నిర్వహణ రోజులను కూడా పొడిగిస్తూ వస్తున్నారు. భక్తులు కోర్కెలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి... అప్పటికే కోర్కెలు నెరవేరిన వారితో వాటిని మార్పిడి చేసుకుంటారు.
ఈ ఏడాది దర్గా పక్కనే ఉన్న చెరువు మధ్యలో వేదికను ఏర్పాటు చేసి... రొట్టెల పండగ చరిత్రను తెలియజేప్పేలా లేజర్ షో, ఫైర్ షో ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు